https://oktelugu.com/

Taking A Train Journey: ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

భారతదేశంలో రోడ్డు మార్గం తరువాత అత్యంత పొడవైనది రైలు మార్గం. దేశవ్యాప్తగా కోట్లాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. నిత్యం వేల కొద్దీ రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది దూర ప్రయాణం చేయాలనుకునేవారు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీతో సహా సౌకర్యవంతంగా ఇందులో అనుకున్న ప్రదేశానికి ప్రయాణం చేయవచ్చు

Written By:
  • Srinivas
  • , Updated On : October 26, 2024 3:37 pm
    Taking a train journey? Must know these things..

    Taking a train journey? Must know these things..

    Follow us on

    Taking A Train Journey: భారతదేశంలో రోడ్డు మార్గం తరువాత అత్యంత పొడవైనది రైలు మార్గం. దేశవ్యాప్తగా కోట్లాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. నిత్యం వేల కొద్దీ రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది దూర ప్రయాణం చేయాలనుకునేవారు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీతో సహా సౌకర్యవంతంగా ఇందులో అనుకున్న ప్రదేశానికి ప్రయాణం చేయవచ్చు. రోజుల తరబడి ఇందులో ప్రయాణించినా ఎలాంటి అలసట ఉండదు. అయితే ట్రైన్ జర్నీ చేసేవారు ప్రయాణానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విషయాలు ఏంటంటే?

    ప్రస్తుతం దూర ప్రయాణాలు చేయాలంటే ఎక్కువగా ట్రైన్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. సాధారణ రైలు నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వరకు భారత్ లో ప్రయాణానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ప్రయాణం చేసే టప్పుడు ఏవో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యగా జీవిత ఆడవాళ్లు ఒంటరిగా ప్రయాణం చేసేవారు కొందరి నుంచి టీజింగ్ ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో దగ్గర్లో చాలా మంది ఉన్నా.. కాపాడడానికి ఎవరూ సాయం చేయకపోవచ్చు. ఇలాంటి సమయంలో పోలీస్ ప్రెటెక్షన్ కావాలంటే 139 కి డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ కు ఫోన్ చేయడం వల్ల నెక్ట్ స్టేషన్ ఏదీ వస్తుందో.. అక్కడి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ చేస్తారు.

    విహార యాత్రలకు కొందరు ట్రైన్ జర్నీ చేస్తుంటారు. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో కూడా రైలు ఎక్కుతారు. ఇలాంటి సందర్భంలో కొన్ని మెడికల్ కు సంబంధించిన వస్తువులను వెంట తీసుకెళ్లలేరు. అయితే అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే వెంటనే 139 కి డయల్ చేయాలి. ఇలా చేయడం వల్ల దగ్గర్లోని స్టేషన్ కు ఈ పిర్యాదు వెళ్తుంది. దీంతో ట్రైన్ కు ఎదురయ్యే స్టేషన్ నుంచి కొందరు పోలీసులు మెడికల్ సిబ్బందితో సహా అక్కడికి వచ్చి రెడీగా ఉంటారు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఈ నెంబర్ ను ఉపయోగించుకోవచ్చు.

    ట్రైన్ జర్నీ చేసే సమయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అని కొందరు చూసుకుంటారు. కానీ కొన్ని రైళ్లలో పారిశుధ్య లోపం కనిపిస్తుంది. చెత్తా చెదారంతో నిండిపోతుంది. సాధారణంగా ఈ క్లీనింగ్ ను ఎప్పటికప్పుడు చేస్తుంటారు. కానీ ఒక్కో సమయంలో ఇబ్బందిని కలిగిస్తే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి సమయంలో clenmycoach అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ట్రైన్ పీఎన్ ఆర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. వెంటనే లాగిన్ అవుతారు. ఆ తరువాత ఇది ఆటోమేటిక్ గా ఫిర్యాదు వెళ్తుంది. దీంతో రైల్వే సిబ్బంది స్పందించి క్లీనింగ్ చేసేవారిని పంపిస్తారు.

    ఇవే కాకుండా రైలు ప్రయాణంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సంబంధిత స్టేషన్ రాగానే అందులో ఫిర్యాదు చేయొచ్చు. అయితే ట్రైన్ జర్నీ చేసే సమయంలో ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే ప్రయాణం సులభతరం అవుతుంది. అలాగే ఇతరులు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలను పరిస్కరించిన వారవుతారు.