Dengue Fever: వర్షాకాలం ప్రారంభమైందంటే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. ఈ ఏడాది డెంగ్యూ వ్యాధి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధిన బారిన పడినవారు చాలా మందే ఉన్నారు. కొందరు సరైన సమయానికి అవసరమైన చికిత్స లభించక మరణిస్తున్నారు. సాధారణ జ్వరంలాగానే అనిపించినా డెంగ్యూ ప్రాణాంతక వ్యాధి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలని అంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అసలు డెంగ్యూ వ్యాధి వచ్చిందని ఎలా తెలుస్తుంది? శరీరంలో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది.
ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వల్ల డెంగీవ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రెయిన్ సీజన్ రాగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ క్రమంలో మానవ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సమయంలో కొన్ని చోట్ల పారిశుధ్యంలోపించడంతో దోమలు విపరీతంగా సంచరిస్తాయి. వీటితో ఎడిస్ దోమ చాలా డేంజర్. ఇది ప్రాణాంతక కీటకాలను మోసుకొచ్చి శరీరంలో విడుదల చేస్తుంది. ఫలితంగా రక్తణాలు తగ్గి నీరసానికి గురిచేస్తుంది. ఆ తరువాత గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
వ్యక్తి శరీరం ఎడిస్ దోమ కుట్టగానే దోమలోని స్రావం శరీరంలో విడుదల అవుతుంది. ఆ తరువాత ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. వాటిల్లో నుంచి ప్లాస్మా ద్రవం మోతాదు దగ్గుతుంది. ఆ తరువాత ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్ల వంటి ఘన పదార్థాల మోతాదులు పెరిగి రక్తం చిక్కబడుతుంది. ఈ ప్రభావం మెదడుపై పడుతుంది. ఆ తరువాత కీలక అవయవాలు దెబ్బతింటాయి. గుండెపై కూడా ప్రభావం ఏర్పడి గుండెపోటుకు గురి కావొచ్చు.
చలిజ్వరం అనగానే మలేరియా అని అనుకునేవారు. అయితే డెంగ్యూ ప్రారంభమయ్యే ముందు కూడా చలి వస్తోంది. అందువల్ల ముందే వ్యాధి నిర్దారణ చేసుకోకుండా వైద్యులను సంప్రదించి ఏ వ్యాధో తెలుసుకోవాలి. ఆ తరువాతే చికిత్స ప్రారంభించాలి. చాలా వరకు డెంగ్యూ జ్వరం మెడిసిన్ తో తగ్గిపోతుంది. అయితే చికిత్స తో పాటు వైద్యులు సూచించిన ఆహారాన్ని సరైన క్రమంలో తీసుకోవాలి. అంతేకాకుండా శరీనంలో నీటి శాతం ఉంచుకునేందుకు ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.