Cameo Role: ఇప్పుడు వస్తున్న సినిమాల్లో క్యామియో రోల్స్ ఎక్కువై పోతున్నాయా..? అసలు వీటి వల్ల సినిమాకు వచ్చే లాభం ఏంటి..?

మొత్తానికైతే వీళ్ళు మంచి గుర్తింపు పొందడమే కాకుండా వీళ్ళ ద్వారా సినిమా మీద మరింత హైప్ పెరిగి సినిమా అనేది భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారడానికి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా చాలామంది క్యామియో రోల్స్ డిజైన్ చేసి మరి పెడుతున్నారు. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాలో ఎలాంటి క్యామియో రోల్స్ ని ప్లే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడు.

Written By: Gopi, Updated On : July 17, 2024 9:56 am

Cameo Role

Follow us on

Cameo Role: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటై పోయింది. కాబట్టి పాన్ ఇండియా లో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చాయి. ఇక అందులో భాగంగానే సినిమా మీద అంచనాలను పెంచడానికి కొంతమంది దర్శకులు ఆ సినిమాల్లో కొంతమంది హీరోలతో క్యామియో రోల్స్ చేయిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఆ సినిమా మీద ఏదో ఒకరకంగా బజ్ అయితే క్రియేట్ చేసి సినిమాకు భారీ కలెక్షన్స్ ని రాబట్టే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన ‘జైలర్’ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన ‘మోహన్ లాల్’ , కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన ‘శివరాజ్ కుమార్’ ల చేత నటింపజేశారు.

ఇక మొత్తానికైతే వీళ్ళు మంచి గుర్తింపు పొందడమే కాకుండా వీళ్ళ ద్వారా సినిమా మీద మరింత హైప్ పెరిగి సినిమా అనేది భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారడానికి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా చాలామంది క్యామియో రోల్స్ డిజైన్ చేసి మరి పెడుతున్నారు. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాలో ఎలాంటి క్యామియో రోల్స్ ని ప్లే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడు. ఇక అలాంటి వాళ్ళను పెట్టుకునే అవకాశం వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ అయితే ఉండాలి. అంతే తప్ప వచ్చిపోయే క్యారెక్టర్ల కోసం మాత్రం తను ఏ నటుడుని తీసుకోడు… మరి ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమాలో ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, అనుదీప్, విజయ్ దేవర కొండ లాంటి వాళ్ళు క్యామియో రోల్స్ ప్లే చేశారు. ఇక దీనివల్ల సినిమా మీద బజ్ అయితే క్రియేట్ అయింది.

కానీ ఈ సినిమాలో ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు వీళ్ళందరిని ఇన్ క్లూడ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వీళ్ళందరి కంటే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ చాలా గొప్పది. మరి అలాంటి సందర్భంలో సినిమాల్లోకి వీళ్ళందరినీ తీసుకువచ్చి దానిద్వారా నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడు అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి స్టార్ హీరోలు లేని సినిమాలో గాని, దర్శకుడు ఆ పర్టిక్యూలర్ సీన్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేను అనుకున్నప్పుడు ఒక క్యామియో రోల్ రావడం వల్ల ప్రేక్షకులు ఎంటైర్ టైన్ అవ్వడమే కాకుండా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఒక పది నిమిషాల పాటు ఆ క్యారెక్టర్ అనేది ప్రేక్షకుల మైండ్ లో ఉంటుంది.

అంతే తప్ప సినిమాలన్నింటికీ క్యామియో రోల్స్ కింద స్టార్ హీరోని తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు అని కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… నిజానికి దర్శకుడి దగ్గర దమ్ముంటే ఇలాంటి క్యామియో రోల్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం క్యామియో రోల్స్ అనేవి అవసరం ఉన్న లేకపోయిన చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి డైరెక్టర్ కూడా వాళ్ళ సినిమాల్లో ఒక క్యామియో రోల్ ను అయితే తీసుకొస్తున్నారు…ఇక ఇప్పుడు ఇదే కొన్ని సినిమాలకు ప్లస్ అయితే మరికొన్ని సినిమాలకు మైనస్ గా మారుతుంది…