Taj Mahal: తాజ్మహల్ భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రేమకు చిహ్నంగా నిర్మించిన కట్టడం అని చెప్పవచ్చు. తాజ్ మహల్ లో పర్యాటక ప్రాంతంగా పరిగణించారు.షాజహాన్ తన భార్య ముంతాజ్ పై ప్రేమతో ఆమె మరణించిన తర్వాత ఆమె సమాధి పై ఈ విధంగా తాజ్ మహాల్ నిర్మించారు. మొత్తం పాలరాతితో నిర్మించిన ఈ తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా మిగిలిపోయింది. ప్రస్తుత ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ ను చూడటం కోసం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే తాజ్ మహల్ షాజహాన్ ముంతాజ్ పై ఉన్న ప్రేమతో మాత్రమే నిర్మించారని అందరికీ తెలిసిందే అయితే ఈ తాజ్ మహల్ వెనుక ఉన్న కొన్ని ఎవరికీ తెలియని విషయాలు గురించి తెలుసుకుందాం….
* ఎంతో సుందరంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఈ తాజ్మహల్ నిర్మించడానికి సుమారు 2200 మంది కార్మికులు పని చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఎంతో అద్భుతమైన ఈ తాజ్ మహల్ లో నిర్మించడానికి సుమారు 16 సంవత్సరాల సమయం పట్టింది.1632లో ప్రారంభించబడింది మరియు 1648లో పూర్తయింది,
* ఇక చక్రవర్తి షాజహాన్ మరొక నల్లరాయి తాజ్ మహల్ లో నదికి అడ్డంగా కట్టాలని భావించారు. అయితే తన కుమారులతో జరిగిన యుద్ధం కారణంగా ఈ కట్టడానికి అంతరాయం ఏర్పడింది. ఇక తాజ్ మహల్ సమాధిపై ఉల్లిపాయ గోపురం దాదాపు 35 మీటర్ల పొడవు ఉంటుంది.
*ముంతాజ్ బేగం ప్రసవ సమయంలో మరణించడం వల్ల ఆమె సమాధిని నిజానికి మహారాష్ట్రలో బుర్హాన్‌పూర్ లో నిర్మించాలని భావించారు. అయితే మహారాష్ట్ర లో పాల రాయి అందుబాటులో లేకపోవడం వల్ల తాజ్ మహల్ ఆగ్రాలో నిర్మించారు.
Also Read: టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటే.. ట్రోలింగ్ చెయ్యరా ?
*అయితే తన భార్య ముంతాజ్ బేగం సమాధి పై పని చేసే వారందరికీ చేతులు నరికి చేయాలని చక్రవర్తి షాజహాన్ ప్రకటించినట్లు కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
* తాజ్ మహల్ నిర్మాణానికి ఉపయోగించిన వస్తువులను సుమారు వెయ్యి ఏనుగుల సహాయంతో ఇక్కడికి తరలించారు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సైన్యం ఈ సమాధి గోడల నుంచి కొన్ని విలువైన రాళ్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: ‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో నటించే హీరోయిన్స్ వాళ్లే
Recommended Video: