AP Govt: జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనకాల పెద్ద కారణాలే ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఏపీలో మూడు రాజధానులు ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ పట్నంలో ఒక జూబ్లీ హిల్స్ లాంటి పెద్ద హబ్‌ను క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల సరసన దాన్ని నిలబెట్టాలన్నది ఆయన ప్లాన్. ఇందులో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీని విశాఖ పట్నంకు తరలి రావాలని కోరారు జగన్. మొన్న చిరంజీవి టీమ్‌తో మీటింగ్ లో భాగంగా.. తన నిర్ణయాన్ని చెప్పారు జగన్. అందరికీ విశాఖలో ఇండ్ల స్థలాలు ఇస్తానని కూడా ప్రకటించారు.
మూడు రాజధానుల్లో విశాఖ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నగరానికి చిత్రపరిశ్రమని తీసుకు వస్తే.. ఆటోమేటిక్ గా కావాల్సినంత ఇమేజ్ ఈ సిటీకి వస్తుందనేది జగన్ ప్రభుత్వం వేస్తున్న ప్లాన్. జూబ్లీ హిల్స్ లో ఎలాగైతే సినీ సెలబ్రిటీలు, పెద్ద బిజినెస్ పర్సన్లు ఉంటారో.. అలాంటి ఏరియాను విశాఖలో కూడా ఏర్పాటు చేస్తే.. రాజధానిగా సెట్ అవుతుందని జగన్ అనుకుంటున్నారు.
Also Read: అక్కడ కొవిడ్ రూల్స్ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న జగన్..!
ఇక మరో విషయం ఏంటంటే.. స్టూడియోలు కట్టుకునే వారికి కూడా ప్లేస్ ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం అనుగుణంగా ఉండే స్థలాలలను సేకరిస్తున్నారు అధికారులు. అయితే ఒక్క విశాఖలోనే స్టూడియోలు కట్టకుండా.. రాజమండ్రి, గుంటూరు లాంటి గుర్తింపు పొందిన ప్రాంతాల్లో కూడా స్టూడియోలు కట్టించాలని స్థలాలు సేకరిస్తున్నారు అధికారులు.
ఏపీలో చాలా ప్రాంతాలు షూటింగులకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి.. 20 శాతం షూటింగ్ ఇక్కడే చేయాలనే రూల్‌ను తీసుకు వచ్చారు జగన్. ఇక దీన్ని త్వరలోనే 50 శాతానికి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. షూటింగులు తీస్తే ఆ ప్రాంతాలు డెవలప్ అవుతాయన్నది జగన్ ప్లాన్. చిరంజీవి, నాగార్జున లాంటి వారు ఆంధ్రాలో స్టూడియోలు కట్టేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు ప్రొడ్యూసర్లు ఇప్పటికే స్టూడియోల కోసం అప్లై చేసుకున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీకి ఆంధ్రాకు తీసుకెళ్లి తాను డెవలప్ చేసినట్టు నిరూపించుకోవాలని అనుకుంటున్నారు జగన్.
Also Read: వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?
Recommended Video: