
TSPSC Paper Leak honey Trap: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) వెబ్‌సైట్ హ్యాకింగ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. టీఎ్‌సపీఎస్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ‘హనీట్రాప్’లో చిక్కుకొని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతనికి ‘వలపు వల’ విసిరిన మహిళ.. రెండు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం రూపొందించిన ప్రశ్న పత్రాలను లీక్ చేసేలా పురిగొల్పినట్లు, దీంతో అతడు కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అతనికి తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్ టీఎస్)కు చెందిన మరో ఉద్యోగి సహకరించినట్లు తెలిసింది.
కాగా, వలపు వల విసిరిన మహిళ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని, తన స్నేహితురాలి కోసం ఈ నిర్వాకానికి పాల్పడిన ఆమె.. ప్రశ్నపత్రాలు చేతికి వచ్చాక వాటిని మరో 13 మందికి విక్రయించిందని తెలుస్తోంది. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు, వచ్చిన మొత్తంలో ఇద్దరు ఉద్యోగులకు రూ.10 లక్షలు చెల్లించి, మిగిలిన రూ.4 లక్షలు తాను తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్టున్నట్లు తెలిసింది.
Also Read: Rahul Sipliganj: ఒక బార్బర్.. ఆస్కార్ రేంజ్ కు ఎలా ఎదిగాడు.. రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ జర్నీ
టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందంటూ కమిషన్ అధికారులు శనివారం బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ నెల 12, 15, 16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన బేగంబజార్ పోలీసులు ఆదివారం టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి పలు ఆధారాలు సేకరించారు. అనంతరం ఐపీ అడ్ర్‌సలను క్రోడీకరించి వెబ్‌సైట్ నుంచి ఏ ఐపీ అడ్రస్ ద్వారా ప్రశ్నపత్రాల సమాచారం బయటకు వెళ్లిందనే విషయంపై ఆరా తీశారు.
విచారణలో.. టీఎస్ పీఎస్సీలో ఉన్నతోద్యోగి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్ అనే ఉద్యోగి వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు టీఎస్పీఎస్సీ సాంకేతిక సహకారం అందిస్తున్న ఒక ఉద్యోగి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా.. వెబ్‌సైట్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వెనుకాల మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఈ మేరకు వీరిలో ఏడుగురు నిందితులను గుర్తించినట్లు, వారిని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణలో రూ.10లక్షలు చేతులు మారిననట్లు సమాచారం. నిందితులను విచారించిన తర్వాత నేడో రేపో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: RRR Oscar Award 2023 : తెలుగు జాతి గర్వపడే సమయం..#RRR ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు