Social Media success tips: మొబైల్ విప్లవం ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఫోన్ లేనప్పుడు ఒక జీవితం.. మొబైల్ వచ్చాక మరో జీవితం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న సమాచారంతోపాటు కావలసిన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఇప్పుడు మొబైల్ తోనే చేస్తున్నారు. అంతేకాకుండా ఒక విద్యార్థి చదువు కోసం.. ఒక గృహిణి నాలెడ్జ్ కోసం మొబైల్ యూజ్ చేస్తున్నారు. అయితే మొబైల్ ద్వారా ఇటీవల ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని వింటున్నాం. కొందరు డ్యాన్స్ వీడియోలు, మరికొందరు సమాచారం ఇచ్చే వీడియోలు.. జీవితానికి సంబంధించిన సలహాలు ఇచ్చే వీడియోలను తయారు చేస్తున్నారు. ఎవరు ఏ వీడియోలు ఇచ్చిన ఇంస్టాగ్రామ్ లో పాపులర్ కావడానికి చాలా సమయం పడుతుంది అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో సక్సెస్ కావడానికి ఏం చేయాలో తెలుసా?
ఇప్పుడు ఎవరి మొబైల్ లో చూసినా.. ఇన్ స్టాగ్రామ్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో చిన్న పిల్లల నుంచి మహిళలు, యువతులు, యువకులు, వృద్ధుల తోపాటు వైద్యులు, లాయర్లు సైతం తమ సూచనలను ప్రజలకు అందిస్తున్నారు. ఇలా వీడియోలు చేసి పాపులర్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కొందరు ఒక్క రాత్రికి స్టార్ అయిన వాళ్ళు ఉంటే.. మరికొందరు పాపులర్ కావడానికి చాలా సమయం పట్టిందని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఇందులో అభివృద్ధి సాధించాలంటే చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికి మాత్రమే ఈ యాప్ అనుగుణంగా ఉంటుంది. అంటే ఎవరైతే ఒక రంగానికి సంబంధించిన వీడియోలు చేయాలని అనుకుంటారో.. అవి క్వాలిటీ అయి ఉండాలి.. అవి వీక్షకులకు నచ్చే విధంగా ఉండాలి.. ఇతరులు చేసిన దానిని అనుకరించకుండా భిన్నంగా ఆకట్టుకోవాలి..
అయితే ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొన్నిసార్లు అనుకున్న స్టార్ డం రాకపోవచ్చు. ఎన్నో రకాల అడ్డంకులు రావచ్చు. అయితే కొందరు ఇలా అడ్డంకులు రావడంతో పాటు సరైన వ్యూస్ రాలేదన్న కారణంగా నిరాశతో ఉంటారు. దీంతో ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోతారు. కానీ అలా ఆగిపోకుండా క్వాలిటీ వీడియోలు చేస్తూ.. ముందుకు వెళ్లడం వల్ల ఎప్పుడో ఒకరోజు కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఓర్పు అనేది చాలా అవసరం. ఎంత సహనం ఉంటే అంత పెద్ద విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే చేసే ప్రయత్నాల్లో మాత్రం కొత్తతనం చూపిస్తూ ఉండాలి. అంటే instagram లో ఎంతోమంది వీడియోలు పెడుతూ ఉంటారు. కానీ కొందరి మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి. ఆ కొందరిలో ఉండాలంటే కాస్త భిన్నంగా ఆలోచించాలి. ప్రజలకు ఎలాంటి వీడియోలు అయితే ఉపయోగకరం అని అనుకుంటారో వాటిని మాత్రమే చేయాలి. అవి కూడా క్వాలిటీ గా ఉండాలి. అలా ఉంటే కచ్చితంగా ఇందులో రాణించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇందులో స్టార్ అయ్యారంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.