https://oktelugu.com/

Sleep Divorce: స్లీప్ విడాకులు అంటే ఏంటి? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే!

భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న గొడవలకి విడాకులు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది ఈ విడాకుల గురించి వినే ఉంటారు. మరి స్లీప్ విడాకులు గురించి ఎప్పుడైనా విన్నారా? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 15, 2024 / 08:20 PM IST

    Marraige Relationship

    Follow us on

    Sleep Divorce: భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న గొడవలకి విడాకులు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది ఈ విడాకుల గురించి వినే ఉంటారు. మరి స్లీప్ విడాకులు గురించి ఎప్పుడైనా విన్నారా? చాలామందికి ఈ స్లీప్ విడాకులు గురించి పెద్దగా తెలియదు. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కలిసి ఉండలేమని అనుకునే వారు విడాకులు తీసుకుంటారు. అదే స్లీప్ విడాకులు అంటే భార్యాభర్తలు బెడ్‌ను షేర్ చేసుకోకపోవడమే. కొందరు నిద్రలో గురక పెట్టడం వంటివి చేస్తారు. భాగస్వామితో నిద్రపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతుంటారు. రాత్రంతా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. భాగస్వామిని ఇబ్బంది పెట్టకూడదంటే స్లీప్ విడాకులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ స్లీప్ విడాకుల వల్ల భార్యాభర్తలకు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

     

    మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే నీరసంగా, యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేరు. నిద్రలేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి భార్యాభర్తలు స్లీప్ విడాకులు తీసుకోవడం ఉత్తమం. కొందరు రాత్రంతా గురక పెడుతుంటారు. దీనివల్ల భాగస్వామి అనారోగ్య పాలవుతారు. కాబట్టి నిద్రపోయేటప్పుడు వేర్వేరు గదుల్లో పడుకోవడం మంచిది. దీనివల్ల భాగస్వామికి నిద్రకు భంగం కలగదు. కొందరు భాగస్వాముల మధ్య ఈ గురక వల్ల గొడవలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురక తగ్గే వరకు స్లీప్ విడాకులు మంచిది. కొందరు భాగస్వాములు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. దీంతో వర్క్ డ్యూటీలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరు నిద్రపోతే మరొకరు వర్క్ చేస్తారు. దీనివల్ల
    పడుకున్న వారి నిద్రకి భంగం కలుగుతుంది. కాబట్టి స్లీప్ విడాకులు తీసుకుంటే ఆ సమస్యలేవి ఉండవు.

     

    కొందరికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం ఉంటుంది. దీంతో వాటితో నిద్రపోతారు. కానీ మీ భాగస్వామికి ఇలా పెంపుడు జంతువులు నచ్చకపోతే వేర్వేరుగా నిద్రపోవడం మంచిది. లేకపోతే పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. కొందరు భాగస్వామి మీద కాలు వేయడం వంటివి చేస్తారు. కొందరికి ఇలా వేస్తే అసలు నిద్రపట్టదు. తెలియకుండా కొందరు భాగస్వామి మీద కాలు వేసేస్తుంటారు. దీంతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అదే స్లీప్ విడాకులు అయితే అసలు గొడవలే రావు. కొందరికి చీకటిలో నిద్రపోతే ఇష్టం. కానీ మరికొందరికి తప్పకుండా బెడ్‌లైట్ ఉండాలి. దీనివల్ల ఒకరి నిద్రకు తప్పకుండా భంగం కలుగుతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గిన నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతో అనారోగ్యం బారిన పడతారు. అదే స్లీప్ విడాకులు తీసుకుంటే ఇక ఇలాంటి గొడవలే భాగస్వాముల మధ్య రావు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఇవి కేవలం గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.