Vettiyan collections : దారుణంగా పడిపోయిన రజినీకాంత్ ‘వెట్టియాన్’ వసూళ్లు..సూపర్ హిట్ టాక్ తో కూడా భారీ నష్టాలు!

సోమవారం రోజు ఈ చిత్రం అటు తమిళనాడులోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణంగా పడిపోయింది. తెలుగు లో ఈ చిత్రం 5 రోజులకు కలిపి కేవలం 50 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 17 కోట్ల రూపాయలకు జరగగా, 5 రోజులకు 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది

Written By: Vicky, Updated On : October 15, 2024 7:42 pm

Vettiyan collections

Follow us on

Vettiyan collections : ఈమధ్య కాలం లో యావరేజ్ రేంజ్ లో ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు దుమ్ము లేపేస్తున్నాయి. అందుకు ఉదాహరణ తమిళ హీరో విజయ్ నటించిన ‘గోట్’, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రాలు. ఈ రెండు సినిమాలకు యావరేజ్ టాక్స్ మాత్రమే వచ్చాయి, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రానికి కూడా అదే స్థాయి వసూళ్లు వస్తాయని ఆశించారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ ని మించి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ కాబట్టి మంచి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం నాలుగు రోజులకు కలిపి ఈ సినిమాకి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అదే జోరుని కొనసాగిస్తుందని అనుకున్నారు. కానీ సోమవారం రోజు ఈ చిత్రం అటు తమిళనాడులోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణంగా పడిపోయింది. తెలుగు లో ఈ చిత్రం 5 రోజులకు కలిపి కేవలం 50 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 17 కోట్ల రూపాయలకు జరగగా, 5 రోజులకు 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్ లో మరో రెండు కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఫైనల్ గా భారీ నష్టంతోనే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి తమిళం, తెలుగు భాషలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 160 కోట్ల రూపాయలకు జరిగింది. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 60 కోట్లు రాబట్టాలి. నేటి వసూళ్లు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే నేడు 5 కోట్ల రూపాయిల గ్రాస్ కంటే తక్కువ వచ్చేలా అనిపిస్తుంది.

ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ వీకెండ్ మంచి వసూళ్లు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా కోలుకోవడం కష్టం. ఎందుకంటే ఎంత వసూళ్లు రాబట్టాలన్నా ఈ వీకెండ్ మాత్రమే రాబట్టాలి, ఆ తర్వాత థియేట్రికల్ రన్ దాదాపుగా క్లోజ్ అయ్యినట్టే అని చెప్పొచ్చు. పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈ చిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది అనేది ట్రేడ్ పండితులకు కూడా అర్థం కావడం లేదు. ఫస్ట్ హాఫ్ రేంజ్ లోనే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే జైలర్ రేంజ్ లో ఆడదాని, డైరెక్టర్ జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాని అటు పూర్తి స్థాయి కమర్షియల్, లేదా పూర్తి స్థాయి సందేశాత్మక చిత్రం లాగా కాకుండా చేయడం వల్లే ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ కాలకేపోయిందని అంటున్నారు.