https://oktelugu.com/

Citadel Honey Bunny Trailer : సిటాడెల్ ట్రైలర్ రివ్యూ : ఒక బిడ్డ కోసం తల్లి పోరాటం.. సీటాడెల్ తో సమంత విశ్వరూపమే చూపించిందిగా..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్న కూడా వాళ్ళు సక్సెస్ లను కొట్టలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్ల నుంచి సక్సెస్ లు ఎందుకు రావడం లేదనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 15, 2024 / 08:18 PM IST

    Citadel Honey Bunny Official Trailer Review

    Follow us on

    Citadel Honey Bunny Trailer : ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేక సినిమా ఇండస్ట్రీ మొత్తం విల విల్లాడుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. కారణం ఏదైనా కూడా వాళ్ల కంటెంట్ లో బలం అయితే లేకుండా పోతుంది. ఇక రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న ‘సిటాడేల్’ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రెయిలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత మెయిన్ లీడ్ లో నటించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వరుణ్ ధావన్,సమంత జంట కూడా చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది. మరి మొత్తానికైతే సినిమాలో సమంత యాక్షన్ ఎపిసోడ్స్ భారీ గా హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఒక ఎమోషనల్ డ్రామా ని కూడా ఇందులో ఇన్ బిల్ట్ గా రన్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇందులో చిన్న పిల్లలతో ఒక ఎమోషన్ డ్రామాని వర్కౌట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా విజువల్స్ తో మ్యాజిక్ చేశారు. కాబట్టి దీని మీద ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.

    ఇక ట్రైలర్ లో చూపించినట్టుగానే ఈ సినిమాలో కూడా మంచి స్టఫ్ ఉన్నట్టైతే సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. ఇక ప్రస్తుతం రాజ్ అండ్ డీకే లు ఒక భారీ హిట్టు మీద కన్నేశారు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాని హిట్టుగా మలచాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ట్రైలర్ లో విజువల్స్ పరంగా వాడిన లైటింగ్ కూడా ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఉన్నాయి. తను ఒక డిఫరెంట్ రోల్ లో నటించి మెప్పించడానికి రెడీ అవుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొంతవరకు ఓకే అనిపించేలా ఉంది.

    ఇక ఈ ట్రైలర్ లో ప్రధానంగా వరుణ్ ధావన్ సమంత లకు కొద్ది సంవత్సరాల క్రితం గొడవలు కావడం తో వాళ్ళు విడిపోయినట్టుగా చూపించారు. ఇక తమ చిన్న కుమార్తె అయిన నదియా ఒక పెద్ద ప్రమాదం లో చిక్కుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తనను కాపాడటానికి ఇద్దరు కలిసి శత్రువుల మీద దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు…

    మరి ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్ తప్పకుండా నిలబడగలుగుతారా లేదా అనేది చూడాలి…