https://oktelugu.com/

Skin Health: తినే అన్నంతో ఇలా చేస్తే.. నిమిషాల్లో మీ అందం రెట్టింపు కావడం పక్కా!

రోజూ మనం తినే అన్నంతో చర్మ సౌందర్యాన్ని ఈజీగా రెట్టింపు చేసుకోవచ్చు. అన్నంలో ఉండే పోషకాలు చర్మంపై ఉండే మొటిమలు, ముడతలను తగ్గించి చర్మాన్ని అందంగా చేస్తాయి. మరి అన్నం ఎలా ఉపయోగిస్తే చర్మం మెరిసిపోతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 / 06:35 AM IST

    Rice

    Follow us on

    Skin Health: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

     

    ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అదే ఇంట్లో ఉండే పదార్థాలతో సహజంగా అందాన్ని పెంచుకుంటే ఎలాంటి సైడ్ అఫెక్ట్స్ కూడా ఉండవు. రోజూ మనం తినే అన్నంతో చర్మ సౌందర్యాన్ని ఈజీగా రెట్టింపు చేసుకోవచ్చు. అన్నంలో ఉండే పోషకాలు చర్మంపై ఉండే మొటిమలు, ముడతలను తగ్గించి చర్మాన్ని అందంగా చేస్తాయి. మరి అన్నం ఎలా ఉపయోగిస్తే చర్మం మెరిసిపోతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    సాధారణంగా అన్నం రోజూ ఇంట్లో వండుకుంటాం. ఇలా వండుకున్న అన్నం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కలబంద జెల్, పసుపు, పెరుగు, శననపిండి టేబుల్ స్పూన్ చొప్పున వేయాలి. వీటి మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక పది నిమిషాల తర్వాత ముఖాన్ని స్క్రైబ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే ముడతలు, ట్యాన్ అంతా కూడా తొలగిపోతుంది. చర్మం అందంగా తయారవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా చేస్తే క్షణాల్లో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. కేవలం ఉడికించిన అన్నంతోనే కాకుండా రైస్ వాటర్‌తో కూడా చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.

     

    రైస్ వాటర్‌ను టోనర్‌గా వాడుకుంటే చర్మంపై ఎలాంటి ముడతలు లేకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. అన్నంలో ఉండే పోషకాలు చర్మాన్ని తెల్లగా చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. కొరియన్లు ఇలాంటి సహజ పద్ధతులను ఎక్కువగా వాడటం వల్ల వాళ్ల చర్మం మిగతా వారితో పోలిస్తే అందంగా ఉంటుంది. కేవలం అన్నంతోనే కాకుండా కలబందతో కూడా చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. కలబందను ముఖానికి అప్లై చేయడం వల్ల ఫేస్ చాలా క్లియర్ అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను క్లియర్ చేస్తాయి. డైలీ నిద్రపోయే ముందు చర్మానికి కలబంద జెల్‌ను అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.