https://oktelugu.com/

Dev Uthani Ekadashi: కోరికలు నెరవేర్చే దేవ్ ఉత్థనీ ఏకాదశి.. ఎలా పూజిస్తే ఫలితాలు ఉంటాయంటే?

కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని దేవ్ ఉత్థనీ అంటారు. ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. అయితే ఈ దేవ్ ఉత్థనీ ఏకాదశి రోజు విష్ణువుని పూజించడం వల్ల సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 / 05:29 AM IST

    Dev Uthani Ekadashi

    Follow us on

    Dev Uthani Ekadashi: హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా భక్తులు శివుడిని పూజిస్తారు. అలాగే ఈ కార్తీక నెలలో వచ్చే అన్ని ప్రత్యేక రోజులకు కూడా ఒక సంప్రదాయం పాటిస్తారు. అయితే ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. అమావాస్య ఏకాదశి కంటే పౌర్ణమి ఏకాదశి రోజు ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఉపవాసం ఆచరించి శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. అయితే ప్రతి నెల వచ్చే ఏకాదశికి ఒక్కో పేరు ఉంటుంది. అదే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని దేవ్ ఉత్థనీ అంటారు. ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. అయితే ఈ దేవ్ ఉత్థనీ ఏకాదశి రోజు విష్ణువుని పూజించడం వల్ల సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే కార్తీక మాసంలో పూజలు హోమాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఆషాడ మాసంలో విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు నిద్రపోయి ఈ కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజున మేల్కుంటారని పండితులు చెబుతున్నారు. మరి దేవ్ ఉత్థనీ ఏకాదశి రోజు ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    మిగతా ఏకాదశులతో పాటు దేవ్ ఉత్థనీ ఏకాదశికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ఈ ఏకాదశిని ప్రభోదిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలి. ముఖ్యంగా దీపాలు వెలిగించడం, ఉసిరి కాయ మీద దీపాలు పెట్టడం, దానం చేయడం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విష్ణుమూర్తికి గంగా జలంతో అభిషేకం చేసి పూజించాలి. ఐదు రకాల పండ్లను దేవుడికి సమర్పించాలి. అలాగే తియ్యని పదార్థాలను నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని తొలగి సంతోషంగా ఉంటారు. అలాగే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి. అయితే విష్ణువుని పూజిస్తూ రోజంతా ఉపవాసాన్ని కూడా ఆచరించాలి. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల ఏడాది మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని పండితులు అంటున్నారు. ఈ ఏకాదశి రోజు వస్త్రం, ఫలాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో ఏళ్ల పుణ్యం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోయి జీవితం సాఫీగా సాగుతుంది. భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోవడం ముఖ్యం.