https://oktelugu.com/

Gold: అసలు బంగారం ఎందుకు తుప్పు పట్టదు.. దీనికి గల కారణాలేంటి?

ప్రాచీన కాలం నుంచి బంగారం వినియోగం ఉంది. దీన్ని క్యారెట్‌ల్లో కొలుస్తారు. ముఖ్యంగా ఇండియాలో అయితే బంగారానికి చాలా విలువ ఉంది. ఇనుము అయితే ఒక్కరోజు ఎండ లేదా వర్షంలో వదిలేస్తే చాలు మొత్తం తుప్పు పడుతుంది. మరి బంగారం ఎందుకు తుప్పు పట్టదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 / 07:45 AM IST

    Gold

    Follow us on

    Gold: ప్రాచీన కాలం నుంచి బంగారం వినియోగం ఉంది. దీన్ని క్యారెట్‌ల్లో కొలుస్తారు. ముఖ్యంగా ఇండియాలో అయితే బంగారానికి చాలా విలువ ఉంది. మహిళలు అయితే బంగారం ధరతో సంబంధం లేకుండా కొంటుంటారు. సాధారణంగానే మహిళలు బంగారం కొంటారు. అలాంటిది పెళ్లిళ్లు పండుగలు అయితే చెప్పక్కర్లేదు. ఇక అన్ని రకాల వస్తువులు కొంటారు. అయితే బంగారం కూడా ఒక లోహం. అయితే ఇనుము వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం ఎందుకు తుప్పు పట్టదని చాలామంది అనుకుంటారు. అసలు మిగతా లోహాలు తుప్పు పడతాయి. ముఖ్యంగా ఇనుము అయితే చెప్పక్కర్లేదు. ఒక్కరోజు ఎండ లేదా వర్షంలో వదిలేస్తే చాలు మొత్తం తుప్పు పడుతుంది. మరి బంగారం ఎందుకు తుప్పు పట్టదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    ఇనుము ఆక్సిజన్, నీటితో చర్య జరిపినప్పుడు ప్రతిచర్య జరుగుతుంది. దీన్ని ఆక్సిడైజింగ్ అని అంటారు. దీనివల్ల ఇనుము ఎక్కువగా నీటిలో ఉంటే తుప్పు పడుతుంది. అయితే ఇది కేవలం ఇనుము అనే కాకుండా వెండి కూడా నల్లబడటం, రాగి, ఇత్తడి కూడా వాటి ఉపరితలంపై ఆకుపచ్చ పొర ఏర్పడటం వంటివి జరుగుతుంది. అదే బంగారం వాతావరణంలోని ఆక్సిజన్‌తో స్పందించదు. దీనివల్ల బంగారం తుప్పు పట్టదు. బంగారం ఆక్సైడ్‌ను తయారు చేయకపోవడం వల్ల తుప్పు పట్టదు. ఇది అతి తక్కువ రియాక్టివ్ మెటల్. బంగారం వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య తీసుకోదు. అలాగే ఇనుము వంటి ఉపరితలంపై ఎలాంటి పొరను ఏర్పరచకపోవడం వల్ల తుప్పు పట్టదు. అయితే చెమట పట్టడం, పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్, యాసిడ్ ఆధారిత క్లీనింగ్ సొల్యూషన్‌లకు గురికావడం వల్ల బంగారం కొన్నిసార్లు నాశనం కావచ్చు.

     

    సాధారణంగా బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు. ఈ క్యారెట్లే బంగారం ఎంత స్వచ్ఛమైనదో చెబుతోంది. బంగారం పరిమాణం 99.9% ఉండాలి. అప్పుడే అది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. అదే 75% అయితే 18 క్యారెట్లు, 58.5% 14 క్యారెట్లు, 41.7% అయితే 10 క్యారెట్ల బంగారంగా చెబుతుంటారు. బంగారు ఆభరణం తయారు చేయాలంటే వెండి, రాగి, నికెల్, ఇనుము మొదలైన ఇతర లోహాలతో కలిపి చేస్తేనే తయారు అవుతుంది. ఆభరణాలలో బంగారం 14 క్యారెట్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటే అది బలహీనమైనదని అర్థం చేసుకోవాలి. 28 గ్రాముల బంగారంతో దాదాపు 8 కి.మీ మేర అతి సూక్ష్మమైన తీగను తయారు చేయవచ్చు. ఈరోజుల్లో బంగారానికి చాలా విలువ ఉంది. అన్నింటి కంటే దీని రేటు రోజురోజుకీ పెరుగుతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అనే కాకుండా సాధారణంగా కూడా బంగారాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని రేటు పెరుగుతున్న కొలది కూడా కొనే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.