YSR Congress: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఉనికి చాటుకుంది అంటే అది స్థానిక సంస్థల వల్లే. 80 శాతానికి పైగా స్థానిక సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. బహుశా ఈ కారణంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉనికిలో ఉంది. అయితే ఇప్పుడు ఒక్కో స్థానిక సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజారనున్నాయి. ఈ నెల 17తో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఏప్రిల్ 3 తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. జూన్ తో మండల పరిషత్తులతోపాటు జిల్లా పరిషత్తులు తమ అధికారాన్ని కోల్పోనున్నాయి. ఒక విధంగా అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలుకానుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే అధికార పార్టీకి ఏకపక్ష విజయమే. ఈ లెక్కన వైసీపీకి ప్రాతినిధ్యం పోవడమే కాదు. ఎన్నికల్లో కూడా తప్పకుండా షాక్ తగులుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* అప్రతిహాస విజయం..
2021లో స్థానిక సంస్థల( local bodies) ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 80 శాతానికి పైగా స్థానిక సంస్థల ను కైవసం చేసుకుంది. ముందుగా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. కనీసం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న వాలంటరీ వ్యవస్థతో అడ్డగోలుగా గెలుచుకుంది. తరువాత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే సీన్. పంచాయితీ ఎన్నికల్లో కొంతవరకు ప్రతిపక్షాలు ఉనికి చాటుకున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టు వైసిపి ఏకపక్షంగా విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీకి మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది. ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహస విజయాలతో దూసుకెళ్లిపోయింది ఆ సమయంలో. అప్పుడే మండల పరిషత్తులతోపాటు ప్రాదేశిక ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు.
* స్థానిక సంస్థల బలం చూసుకొని..
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 11 ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో సరిపెట్టుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మాత్రం స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అప్పటికే రాష్ట్ర శాసనమండలితో పాటు కేంద్రంలోని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే సంఖ్యాబలం ఎక్కువ. ఆపై ఎలాగూ స్థానిక సంస్థలు వైసీపీ చేతిలో ఉన్నాయి. అయితే ఈ రెండేళ్లలో వైసిపి ఎంతో కొంత ఉనికి చాటుకుంది అంటే అది స్థానిక సంస్థల పుణ్యమే. ఇప్పుడు అవే స్థానిక సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నాయి. పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలుపు పొందే అవకాశం లేదు. ఇప్పుడు అసలు సిసలైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోనుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే వివిధ కారణాలు చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుందో? లేకుంటే ఎదుర్కొంటుందో? చూడాలి.