https://oktelugu.com/

Shravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం.. ఈ నెలలో ఏం చేయాలి? మాంసాన్ని ఎందుకు తినొద్దంటే?

శ్రావణ మాసంలో అత్యధికంగా పండుగలు వస్తాయి. ఇదేనెలలో రాఖీ పౌర్ణమి, నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం వంటివి వస్తాయి. అంతేకాకుండా శ్రావణమాసంలో దేవుళ్లను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కొందరు పండితులు చెబుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 17, 2023 / 02:20 PM IST

    Shravana Masam 2023

    Follow us on

    Shravana Masam 2023: శ్రావణ మాసం అనగానే పూజలు, వ్రతాలు ఉంటాయి. శుభముహూర్తాలకూ ఈ నెల అనుకూలమైంది. గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు జోరుగా సాగనున్నాయి. గత రెండు నెలలుగా (ఆషాడం, శూన్యమాసం) శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. ఇక ఇప్పటి నుంచి ఇవి జోరందుకోనున్నాయి. అయితే ప్రతీ ఏడాది శ్రావణం వస్తుందంటే ఉపవాసాలకు రెడీ అవుతారు. నెల మొత్తం పాస్టింగ్ లతో గడిపేస్తారు. మాంసాన్ని తినరు. మద్యాన్ని ముట్టుకోరు. అసలు శ్రావణ మాసంలో మాంసాహారాన్ని ఎందుకు తినరు? ఆధ్యాత్మిక ప్రకారంగానే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా? ఆ వివరాల్లోకి వెళితే..

    శ్రావణ మాసంలో అత్యధికంగా పండుగలు వస్తాయి. ఇదేనెలలో రాఖీ పౌర్ణమి, నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం వంటివి వస్తాయి. అంతేకాకుండా శ్రావణమాసంలో దేవుళ్లను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కొందరు పండితులు చెబుతున్నారు. అందువల్ల చాలా మంది శ్రావణమాసం నెల మొత్తం మాంసం తినకుండా మద్యం జోలికి వెళ్లకుండా ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాంసం తినకూడదు అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రచారం మాత్రమే కాదని దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని కొందరు తేల్చారు.

    శ్రావణ మాసం జూలై, ఆగస్టు లలో వస్తుంది. ఈసారి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అధిక శ్రావణం జూలై 18న ప్రారంభమై ఆగస్టు 16తో ముగిసింది. ఆ తరువాత రోజు అంటే ఆగస్టు 17 నుంచి అసలైన శ్రావణం ప్రారంభం అయింది. నిజ శ్రావణం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. ఇక ప్రతీ ఏడాది జూన్, జూలైలో వర్షాలు కురి ఆగస్టు, సెప్టెంబర్ వరకు తగ్గుముఖం పడుతాయి. ఈ తరుణంలో వాతావరణం కలుషితం ఏర్పడుతుంది. అంతేకాకుండా వర్షాలకు మాంసాన్ని అందించే గొర్రెలు, మేకలు అనేక వ్యాధుల బారిన పడుతాయి.

    ఈ సమయంలో ఎక్కువ శాతం మేత దొరకపోవడంతో ఇష్టం వచ్చినట్లు మేస్తాయి. ఈ క్రమంలో వాటికి జీర్ణం కానివి కూడా తింటాయి.ఫలితంగా గొర్రెల్లో జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో అనేక వ్యాధులు పుట్టుకొస్తాయి. అంతేకాకుండా శ్రావణ మాసం వచ్చే నెలలోనే గొర్రెలు ఎక్కువగా ప్రసవిస్తాయి. ప్రసవించే గొర్రెలను వధించకూడదని అంటారు. ఒకవేళ వధించినా వాటిని తినే వారు రోగాలన బారిన పడుతారని చెబుతున్నారు. అందువల్ల శ్రావణ మాసం మొత్తం మాంసం తినకుండా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.