AP Women Commission: మహిళా కమిషన్ లో వివాదం

వాస్తవానికి వాసిరెడ్డి పద్మ పదవీకాలం ఈ ఏడాది మే 15 తో ముగిసినట్లు వార్తలు వచ్చాయి. ఆమె కొనసాగింపు పై ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే.. చైర్ పర్సన్ పదవిని వెలగబెడుతున్నారని.. లేని పదవితో ఉత్తర్వులు, ఆదేశాలు ఇస్తున్నారని టాక్ నడిచింది.

Written By: Dharma, Updated On : August 17, 2023 1:57 pm

AP Women Commission

Follow us on

AP Women Commission: రాష్ట్ర మహిళా కమిషన్ తీరు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చైర్ పర్సన్ హోదాలో ఉన్న వాసిరెడ్డి పద్మ పేరును మిగతా సభ్యులు బాహటంగా విమర్శిస్తున్నారు. తాజాగా మహిళా కమిషన్ సభ్యురాలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు సొంతిల్లు చక్కదిద్దుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పై సెటైర్లు పడుతున్నాయి.

వాస్తవానికి వాసిరెడ్డి పద్మ పదవీకాలం ఈ ఏడాది మే 15 తో ముగిసినట్లు వార్తలు వచ్చాయి. ఆమె కొనసాగింపు పై ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే.. చైర్ పర్సన్ పదవిని వెలగబెడుతున్నారని.. లేని పదవితో ఉత్తర్వులు, ఆదేశాలు ఇస్తున్నారని టాక్ నడిచింది. ఆ మధ్యన వాలంటీర్ల పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో ఏకంగా నోటీసులు జారీ చేశారు. వాటికి పవన్ సమాధానం చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు తరువాతే ఆమె లేని పదవి నుంచి ఉత్తర్వులు ఇచ్చారని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు తాజాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి వాసిరెడ్డి పద్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియో ఒకటి విడుదల చేశారు. అది చర్చనీయాంశంగా మారింది.

గత రెండేళ్లుగా గజ్జల లక్ష్మి మహిళా కమిషన్ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీలో నిర్వహించిన సమావేశాలకు ఆమె హాజరయ్యారు. తన సొంత డబ్బులతో సమావేశాలకు హాజరైనట్లు ఆమె చెప్పుకొస్తున్నారు. వివిధ అలవెన్స్ లకు సంబంధించి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయని.. దీనికి వాసిరెడ్డి పద్మ వైఖరి కారణమని గుజ్జుల లక్ష్మీ ఆరోపిస్తున్నారు. ఆ బిల్లులకు సంబంధించి చైర్ పర్సన్ హోదాలో ఉన్న పద్మ సంతకం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ప్రభుత్వ తీరుపై మహిళా కమిషన్ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కారును ఇరుకున పెట్టారు. కనీసం మహిళా కమిషన్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదని తన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే వివిధ కుల కార్పొరేషన్ లను వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటికి అధ్యక్షులతో పాటు సభ్యులను కూడా నియమించారు. కానీ వీటికి కనీసం ఎక్కడ కార్యాలయాలు అంటూ లేవు. ఇప్పుడు ఆ జాబితాలోకి మహిళా కమిషన్ చేరడం విచారకరం.