Homeబిజినెస్Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా తీసుకుంటారు. తీసుకున్న అప్పును తిరిగి ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుత రోజుల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టంగా మారుతుంది. అయితే ఇలాంటి సమయంలో ముందుగా డబ్బు ఇచ్చి మంచి సంబంధాలు చెడగొట్టుకోవద్దని కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు అప్పుగా ఇస్తే.. ఆ తర్వాత అదే డబ్బు తిరిగి రాకపోవడం, అడిగేందుకు ఇబ్బంది పడటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చని మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?

కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం.. డబ్బులు ఇవ్వకముందు ఉన్న రిలేషన్.. ఇచ్చిన తర్వాత ఉండదు. సాధారణంగా ఒక వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇచ్చిన తర్వాత.. ఆ మొత్తాన్ని తిరిగి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తికి ఇబ్బందిగా అనిపించవచ్చు. మరోవైపు డబ్బులు ఇచ్చిన వ్యక్తి తన డబ్బు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తుంటారు. ఈ పరిస్థితి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంటుంది.

అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే.. ఇచ్చిన వ్యక్తి పదేపదే ఫోన్ చేస్తుంటాడు. అయితే డబ్బులు అడుగుతారనే ఉద్దేశంతో కొందరు ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా ఉండటం, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం వంటివి చేస్తారు. డబ్బులు అడిగేందుకు కాకపోయినా మామూలుగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇలా అప్పు ఇవ్వక ముందు.. ఇచ్చిన తరువాత ఇద్దరి మధ్య సంబంధాల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి.

అందుకే స్నేహం, బంధుత్వం కొనసాగాలని కోరుకుంటే.. అప్పుగా డబ్బులు ఇవ్వకుండా ఉండటమే మంచిదని ఆర్థిక, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎవరికైనా ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశం ఉంటే, తిరిగి వస్తుందనే ఆశ వదులుకోవాలని అంటున్నారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో డబ్బు తిరిగి రాకపోయినా సంబంధాలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రతి సందర్భంలోనూ అప్పు ఇవ్వకూడదనే అర్థం కాదు. కుటుంబ సభ్యులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సన్నిహితులకు ఆర్థిక సాయం చేయొచ్చు. అలాంటి సమయంలో ఎంత మొత్తం ఇవ్వాలి? తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? డబ్బు ఇవ్వడం వల్ల మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఎలా ఉంటుంది వంటి అంశాలను ముందుగా ఆలోచించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
Oktelugu Epaper