How to close home loan faster: ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి కల. కానీ కొంతమంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కూడా పెట్టడం కాకుండా.. హోమ్ లోన్ ద్వారా ఇల్లు నిర్మించుకుంటున్నారు. కానీ హోమ్ లోన్ తీసుకున్నంత ఈజీగా తీర్చడం కాదు. ఒకసారి హోమ్ లోన్ తీసుకుంటే సంవత్సరాల తరబడి ఈఎంఐ పే చేయాల్సిందే. అయితే ధనవంతులు సైతం భవనాలు నిర్మించుకునేందుకు గృహ రుణాలు తీసుకుంటూ ఉంటారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీళ్లు తొందరగానే హోమ్ లోన్ ను పూర్తి చేస్తారు. అది వారికి వచ్చిన ఆదాయం తో కాకుండా ఒక చిన్న ట్రిక్ తో ఇలా తొందరగా గృహ ఋణాన్ని క్లోజ్ చేస్తారు. మరి వారు చేసే ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: డబ్బుంటేనే విలువ.. సంపాదించు మరీ
హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. కానీ ఈఎంఐ పే చేసేటప్పుడు మాత్రం ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే కనీసం 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల కేవలం 20 లేదా 15 సంవత్సరాల లోపు ఈ గృహహ్రుణాని పూర్తి చేయవచ్చు.
ఉదాహరణకు 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారని అనుకుందాం. ఈ మొత్తంపై 8.5% వడ్డీ ఉంటే.. దీనికి 25 సంవత్సరాల పాటు టెన్యూర్ నిర్ణయించుకుంటే.. ఈఎంఐ నెలకు రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొదటి ఏడాదిలో రూ.4,83,136 చెల్లిస్తారు. ఈ మొత్తానికి రూ.4,22,681 వడ్డీని చెల్లిస్తారు. అయితే ఈ భారం పడకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు అవలంబించాలి. వీటిలో మొదటిది..
Also Read: పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. ఎలా పొందాలో తెలుసా?
మొదటి ఏడాదిలో 12 ఈఎంఐలు చెల్లిస్తారు. రెండో ఏడాదిలో 13 ఈఎంఐ చెల్లించే ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 20 సంవత్సరాల్లో లోన్ క్లోజ్ అవుతుంది. మరో విషయం ఏంటంటే. ప్రతి ఏడాది 7.5% అమౌంట్ను పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి ఏడాదిలో రూ. 40,000 చెల్లిస్తారు. రెండో ఏడాదిలో రూ. 43,000 చెల్లించాలి. ఇలా ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ను పెంచుతూ పోవాలి. ఇలా చేస్తే 25 సంవత్సరాల్లో చెల్లించాల్సిన మొత్తాన్ని.. 12 సంవత్సరాల వరకు హోమ్ లోన్ క్లోజ్ చేస్తారు.
పై రెండు కలిపి చేయడం వల్ల 10 సంవత్సరాల లోనే గృహ రుణాన్ని కట్టేస్తారు.
అయితే చాలామంది బ్యాంకర్స్ ఈ విషయాలను బయటకు చెప్పరు. కానీ వారిని అడిగి మీరు ఈ విధంగా లోనును చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హోమ్ లోన్ భారం పడకుండా ఉంటుంది. అంతేకాకుండా తొందరలోనే దీనిని పూర్తి చేస్తారు.