Sleeping : మారుతున్న జీవనశైలి వల్ల రోజులు కూడా మారుతున్నాయి. లైఫ్ స్టైల్ మారుతుంది. పక్కన ఉండే బంధాలు మారుతున్నాయి. ఆరోగ్యం మారిపోతుంది. జస్ట్ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జీవితం తలకిందులు అవుతుంది అంటున్నారు నిపుణులు. నిజంగా ఇది వాస్తవే. ఇండియాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి కారణాలు కూడా జంటలు చేసే తప్పే. ఇందులో మరీ ముఖ్యంగా స్లీపింగ్ డైవర్స్ వల్ల ఎక్కువ విడిపోతున్నారు. ఇంతకీ ఈ స్లీపింగ్ డైవర్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా?
భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి పడుకోకుండా వేరు వేరుగా పడుకోవడమే స్లీపింగ్ డైవర్స్. దీని వల్ల ఇద్దరిలో దూరం పెరిగి తగాదాలు ఆ తర్వాత విడాకుల వరకు కూడా వెళ్తుంది అంటున్నారు నిపుణులు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. అలాంటిది వేరు వేరుగా పడుకుంటే అన్యోన్యత ఎక్కడ ఉంటుంది చెప్పండి?
Also Read : భాగస్వామితో కలిసి నిద్రిస్తే ఇన్ని ప్రయోజనాలా.. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
రీసెంట్ నివేదికలో దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రపంచ నిద్ర సర్వేలో నిద్రకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే నిద్రకు భంగం కలిగించే కారణాలను వెల్లడించింది. వాటిలో మొదటిది ఒత్తిడి అంటుంది సర్వే. అంతేకాదు స్లీపింగ్ డైవర్స్ గురించి కూడా ఈ సర్వే కొన్ని విషయాలను తెలిపింది.
సర్వే ప్రకారం, స్లీపింగ్ డైవర్స్ విషయంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడ 78% జంటలు ఈ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారట. అయితే భాగస్వామి గురక , బిగ్గరగా శ్వాస తీసుకోవడం లేదా ఊపిరి ఆడకపోవడం (32%), విశ్రాంతి లేకపోవడం (12%), సరైన నిద్ర షెడ్యూల్ లేకపోవడం (10%), రాత్రి సమయంలోనే స్క్రీన్ వాడకం (8%) వంటి కారణాల వల్ల స్లీపింగ్ డైవర్స్ ఎక్కువ అవుతున్నాయట. వారి ఈ అలవాట్ల వల్ల స్త్రీలు వేరుగా పడుకుంటున్నారు. ఇక ఇండియా తర్వాత చైనా 67%తో రెండవ స్థానంలో, దక్షిణ కొరియా 65%తో మూడవ స్థానంలో ఉన్నాయి.
విడిగా నిద్రపోవడం వల్ల కలిగే ఫలితం-
ఈ సర్వే జంటల సంబంధంపై స్లీపింగ్ డైవర్స్ ప్రభావాన్ని కూడా వెల్లడించింది. 65% మంది విడిగా పడుకున్న తర్వాత మెరుగైన విశ్రాంతిని అనుభవించారు. 31% మంది తమ సంబంధం మెరుగుపడిందని చెబితే.. 30% మంది తమ సంబంధాన్ని మరింత దిగజార్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో, 28% మంది ఇది వారి లైంగిక జీవితాన్ని మెరుగుపరిచిందని నమ్ముతారు. కానీ 22% మంది దీనికి విరుద్ధంగా అభిప్రాయాన్ని వెల్లడించారట.
నిద్ర విడాకులు తీసుకుంటుందా?
సాధారణంగా వివాహం తర్వాత భార్య భర్త ఒకే మంచం మీద పడుకుంటారు. ఇలాంటి సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. కానీ ఇటీవలి కాలంలో ‘స్లీప్ డివోర్స్’ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఇది జంటలలో త్వరగా ప్రాచుర్యం పొందింది. జంటలు వేర్వేరు గదులు లేదా పడకలలో పడుకోవడం ఫ్యాషన్ గా మారింది. దీన్ని అనుసరించే జంటలు శారీరకంగా విడిపోయినా, మానసికంగా ఒకరికొకరు దగ్గరగా ఉంటున్నారు. కానీ కొందరు మాత్రం మరింత దూరం అవుతున్నారు. సాధారణంగా ప్రజలు బాగా నిద్రపోవాలి అనుకుంటారు. అలిసి పోయిన తర్వాత పక్కన డిస్ట్రబెన్స్ వల్ల కొందరు ఇబ్బంది పడతారు. సో స్లీప్ డైవర్స్ వల్ల కొందరికి మంచి జరిగితే కొందరికి చెడు జరుగుతుంది.
Also Read : పిల్లో లేకుండా నిద్రపోతే.. ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో మీకు తెలుసా?