Sleeping : నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి ముఖ్యమైనది. ఎంత హాయిగా ఫుల్‌గా నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొందరు కంఫర్ట్ కోసం తల కింద దిండు పెట్టుకుని నిద్రపోతే.. మరికొందరు దిండు పెట్టుకోరు. దిండు పెట్టుకుని నిద్రపోవడం కంటే లేకుండా నిద్రపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరికి దిండు లేకపోతే అసలు నిద్రపట్టదు. ఎందుకంటే తల అంతా నొప్పిలా అనిపిస్తుంది. కానీ దిండు లేకుండా మొదటి రోజు నొప్పిగా అనిపించినా.. ఆ తర్వాత అలవాటు అవుతారని నిపుణులు చెబుతున్నారు. మరి దిండు లేకుండా నిద్రపోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వెన్నునొప్పి తగ్గుతుంది
దిండు లేకుండా నిద్రపోవడం వల్ల వెన్నెముక నొప్పి తగ్గుతుంది. దిండ్లు పెట్టుకుని నిద్రపోవడం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. ఎందుకంటే దిండు ఎత్తుగా ఉండటం వల్ల కొందరికి కంఫర్ట్ ఉండదు. కాబట్టి దిండు లేకుండా హాయిగా నిద్రపోండి. దీని వల్ల ఎలాంటి వెన్నెముక నొప్పి లేకుండా హాయిగా నిద్రపడుతుంది.
మెడ నొప్పి తగ్గుతుంది
దిండు లేకపోతే మెడ నొప్పి వంటివి ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ దిండుతో నిద్రపోవడం వల్లే మెడ నొప్పి వస్తుంది. దీనికి తోడు ఎత్తు దిండ్లు వల్ల మెడ నొప్పి పెరిగిపోతుంది. అలాగే నిద్ర సరిగ్గా పట్టనివ్వదు. కాబట్టి దిండు లేకుండా సరిగ్గా నిద్రపోండి. దీని వల్ల మెడ నొప్పి ఉండకుండా కండరాల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది.
తలనొప్పి రావచ్చు
కొందరి అనుకోకుండా తలనొప్పి వస్తుంది. దిండు మీద పడుకోవడం వల్ల తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దిండు లేకుండా పడుకోండి. మీకు తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే దిండుల వల్ల తలకు ఆక్సిజన్ సరఫరా అంతగా అందదు. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
దిండు వేసుకుని నిద్రపోతే రాత్రంతా నిద్ర లేకుండానే అనిపిస్తుంది. దీంతో ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి దిండు లేకుండా నిద్రపోతే హాయిగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కూడా రాదు.
మొటిమలను నివారిస్తుంది
దిండుతో నిద్రపోతే మొటిమలు వస్తాయి. ఎందుకంటే తలకి రాసుకున్న నూనె అంతా కూడా దిండుకు అంటుంది. మీరు దాని మీద ముఖం పెట్టినప్పుడు ఆ నూనె మరకలు అంటుకుని మొటిమలు వస్తాయి. అలాగే దద్దర్లు, ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. కాబట్టి దిండు లేకుండా నిద్రపోండి. లేకపోతే దిండు కవర్‌ను కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేయండి. దీనివల్ల బ్యాక్టీరియా కాస్త క్లియర్ అవుతుంది.
నిద్రపోయే భంగిమ బట్టి..
కొందరు పక్కకి, వెనుకకు, కడుపును కిందకి పెట్టి నిద్రపోతుంటారు. అయితే ఒక్కో భంగిమలో నిద్రపోయే వారికి తప్పకుండా దిండు ఉండాలి. వెనుకకు నిద్రపోయే వారికి దిండు అక్కర్లేదు. కానీ పక్కకి పడుకునేవారికి తప్పకుండా దిండు అవసరం. మిగతా భంగిమల కంటే పక్కకి పడుకుని నిద్రపోయే వారు అసలు దిండు లేకుండా నిద్రపోకూడదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.