Ravi Teja (1)
Ravi Teja: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Ravi Teja) కెరీర్ ఎలా మొదలైందో మన అందరికీ తెలిసిందే. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ, హీరో గా మారి, హిట్టు మీద హిట్టు కొడుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆయన కెరీర్ జర్నీ మొత్తం నేటి తరం యువతకు ఒక ఎంతో ఆదర్శప్రాయం. ఏ రంగం లో అయినా పని పట్ల నూటికి నూరు శాతం ద్రుష్టి పెట్టి అంకిత భావం తో పని చేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే దానికి రవితేజ ఒక ఉదాహరణ. తన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి కష్టం విలువ తెలిసేలాగా పెంచానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు రవితేజ. ఇది ఇలా ఉండగా రవితేజ కి మహాధన్(Mahadhan) అనే కొడుకు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇతను ‘రాజా ది గ్రేట్’ చిత్రం లో రవితేజ చిన్నప్పటి క్యారక్టర్ చేశాడు. ఆ క్యారక్టర్ లో మహాధన్ ని చూసిన ప్రతీ ఒక్కరు కుర్రాడు చాకు లాగా ఉన్నాడు, గుడ్డివాడి క్యారక్టర్ రవితేజ కంటే బాగా చేశాడు వంటి కామెంట్స్ చేశారు. మహాధన్ చెప్పే డైలాగ్స్ లో కూడా మంచి ఈజ్ కనపడింది. హీరో గా ఎంట్రీ ఇస్తే ఇండస్ట్రీ ని దున్నేస్తాడు అని అందరూ అనుకున్నారు. మరో రెండు మూడేళ్ళలో ఇండస్ట్రీ లోకి హీరోగా వచేస్తాడని రవితేజ అభిమానులు అనుకుంటూ ఉంటే, మహాధన్ ఏమో ప్రముఖ డైరెక్టర్ సందీప్ వంగ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో అవుతావని మేమంతా ఆశపడితే, డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నావా?, ఇదేమి ట్విస్ట్ సామీ అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ప్రభాస్(Rebelstar Prabhas) తో ‘స్పిరిట్'(Spirit Movie) అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి రవితేజ కొడుకు మహాధాన్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కొడుకు రిషి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయబోతున్నాడు. వీళ్ళిద్దరితో పాటు మరో 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ని పెట్టుకున్నాడట సందీప్ వంగ. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. సందీప్ వంగ నేటి తరం ఆడియన్స్ లోని బోల్డ్ ఆలోచనలకూ తగ్గట్టుగా సినిమాలు తీయడం లో దిట్ట. కాస్త వింటేజ్ రామ్ గోపాల్ వర్మ స్టైల్ అతని మేకింగ్ లో ఉంటుంది. సరిగ్గా పని నేర్చుకుంటే కచ్చితంగా ఇండస్ట్రీ లో ఎంతో ప్రతిభ గల దర్శకులుగా మహాధాన్, రిషి లు బయటకు వస్తారు. చూడాలి మరి వీళ్ళ భవిష్యత్తు ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ravi tejas son joins as assistant director to star director
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com