https://oktelugu.com/

Royal Enfield : హిమాలయన్ 450 రివ్యూ రిపోర్టు. బైక్ ఫీచర్స్ అదిరిపోలా..

కంపెనీకి చెందిన పాపులర్ బైకుల్లో హిమాలయన్ 450 ఒకటి. దీనిని హిమాలయన్ బైక్ ఆధారంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తీసుకొచ్చారు

Written By:
  • Srinivas
  • , Updated On : January 3, 2025 / 11:53 AM IST

    Himalayan-450

    Follow us on

    Royal Enfield:  కంపెనీకి చెందిన పాపులర్ బైకుల్లో హిమాలయన్ 450 ఒకటి. దీనిని హిమాలయన్ బైక్ ఆధారంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తీసుకొచ్చారు. 450 సీసీ ఇంజిన్ తో పనిచేసే ఈ బైక్ పెర్సా 452, సింగిల్ సిలిండర్ , లిక్విడ్ కూల్డ్ మోటారుతో పనిచేస్తుంది. ఇది లీటర్ కు 29.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మిగతా వాటి కంటే తక్కువ మైలేజ్ ఇచ్చినప్పటికీ దీనిపై డ్రైవింగ్ ఒక కొత్త అనుభూతి అని కొనియాడుతున్నారు. అయితే ఇటీవల ఈ బైక్ పై 4000 కిలోమీటర్లు ప్రయాణించిన సందర్భంగా ఓ వ్యక్తి బైక్ గురించి చెప్పసాగారు. అత్యంత వేగంతో పాటు అనుగుణంగా డ్రైవింగ్ ఉన్న ఈ బైక్ చాల అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పి వివరాల ప్రకారం..

    భారత్ కు చెందిన Royal Enfield గెరిల్లా 450 300 సీసీ నుంచి 500 సీసీ మధ్యలో ఉన్న 450 సీసీ కొత్త రోడ్ స్టర్. దీనిని పరీక్షించిన తరువాత ఎలాంటి రోడ్డుపైనా అయినా సురక్షితంగా వెళ్లేందుకు అనుగుణంగా ఉంటుందని తేల్చారు. ఇది 452 సీసీని ఉపయోగించినప్పుడు 39.6 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ట్యూబ్ లెస్ టైర్లుగా ఉన్న ఈ బైక్ 432 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది. హిమాలయన్ 450ని రూ.2,85, 000ల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. త్వరలో ఇది అమెరికాకు కూడా ఎంట్రీ ఇస్తుందన్న తరుణంలో ఈ బైక్ గురించిన విశేషాలు బయటపడుతున్నాయి.

    రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయ బైక్ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. దీనిపై 2023 ఏడాది సెప్టెంబర్ లో 28 కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టారు. ఆతరువాత ప్రతీనెల 423 కిలోమీటర్లు సామర్థ్యం ఉన్న ఈ బైక్ పై జవనవరి 2 2025 నాటికి 3,931 కిలోమీటర్లు పూర్తి చేశారు. కొత్త ఏడాది ప్రారంభం అయిన తరువాత రెండు రోజులు 31 కిలోమీటర్లు ప్రయాణించారు. అంటే 15 నెలల కాలంలో ఈ బైక్ పై 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు ఉన్న అనుభూతిని ఓ వ్యక్తి వివరించారు. 452 సీసీ సింగిల్ ఇంజిన్ ను కలిగిన ఈ బైక్ ప్రత్యేకించి 410 లాంగ్ స్ట్రోక్ వద్ద ట్రిపుల్ స్పీడ్ ను కలిగి ఉంది. ఆఫ్ రోడ్ సమార్థ్యం కంటే హైవేలపై బైక్ అద్భుతంగా డ్రైవ్ చేసింది.

    భారత్ లో అత్యంత సరసమైన బైకుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ఒకటి అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొదట్లో ఈ బైక్ ను కొనుగోలు చేసే సమయంలో బైక్ గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ దీనిపై రైడ్ చేస్తున్ సమయంలో మధురానుభూతి పొందినట్లయింది. అయితే హార్డ్ బ్రేకింగ్ లో కొస్త ఇబ్బందులు పెట్టింది. కానీ ఇది వర్క్ షాప్ నకు మాత్రం తీసుకెళ్లనివ్వలేదు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ బైక్ వీల్ బేస్ 1,510తో ఉంది. ఇది 40 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.