Dark Oxygen : రోజురోజుకీ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సైన్స్ (Science) అనేది రోజుకి ఒక సీక్రెట్ బయటకు వస్తుంది. అయితే నిజానికి మనం సముద్రాన్ని కేవలం ప్రకృతి కోసం చూస్తుంటాం. అలలు, బీచ్ (Beach) అందాలనే గమనిస్తాం. కానీ మనకి తెలియని ఎన్నో రహస్యాలు సముద్రంలో ఎన్నో ఉన్నాయి. ప్రకృతిలో మనకి తెలియని ఎన్నో సంపదలు ఉన్నాయి. కొన్ని అయితే మనం వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటిదే తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో ఓ సీక్రెట్ బయటపడుతోంది. ఈ రహస్యం ఆఖరికి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి వస్తుంది. కానీ పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని రాళ్లు (Stones) ఆక్సిజన్‌ను (Oxygen) ఉత్పత్తి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు రాళ్ల నుంచి ఆక్సిజన్ ఏంటి? ఇది సాధ్యమేనా? ఎలా ఉత్పతి చేస్తాయో? పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పసిఫిక్ మహాసముద్రం లోపల చీకటి ప్రపంచంలోని కొన్ని రాళ్లు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీన్ని డార్క్ ఆక్సిజన్ అని పేర్కొన్నారు. అయితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా పగటిపూట సూర్యకాంతిలో మాత్రమే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందనే విషయం ఇప్పటికీ అందరూ నమ్ముతారు. కానీ ఈ రాళ్లతో ఆక్సిజన్ అంటే నమ్మడానికి కూడా కాస్త కష్టమే. సూర్యరశ్మి లేకుండా లోతైన సముద్రంలో రాళ్లతో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. సముద్రపు అడుగు భాగంలో ఉన్న అరుదైన లోహపు వస్తువులు ఉప్పు నీటితో చర్య తీసుకోవడం వల్ల ఆక్సిజన్ ఏర్పడుతుందని గుర్తించారు.
ఆక్సిజన్ వివిధ ప్రక్రియల ద్వారా చీకటిలో ఉత్పత్తి అవుతుంది. కిరణ జన్య సంయోగ క్రియకు తప్పకుండా సూర్యరశ్మి అవసరం. అయితే సముద్రపు లోపల సూర్యరశ్మి ఉండదు కదా.. ఎలా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందనే డౌట్ మీకు రావచ్చు. అంటే సముద్రపు లోపల హాలో ప్లాంక్టన్, తేలియాడే మొక్కలు, ఆల్కే, కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి సముద్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడతాయి. ఈ జీవులు అన్ని కూడా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను చేయగలవు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు తగినంత సూర్యరశ్మి లేకపోయినా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. అయితే మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, లిథియం వంటి వాటి వల్ల సూర్యరశ్మి లేకపోయినా కూడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు.