Svalbard : ఈ ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయానికి సూర్యోదయం అవుతుంది. మన ఇండియాలో (India) అయితే ఏడాది అంతా కూడా పగలు, రాత్రి అవుతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరు నెలలకు ఒకసారి పగలు, రాత్రి వస్తుంది. సాధారణంగా అయితే రాత్రి తర్వాత ఉదయమే (Morning) వస్తుంది. కానీ ఈ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం ఆరు నెలలకు ఒకసారి రాత్రి, పగలు వస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఉదయం మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. కానీ కేవలం ఒక్క దేశంలో మాత్రం సూర్యుడు (Sun) అర్థరాత్రి కూడా ఉదయిస్తాడు. అసలు అర్థరాత్రి సూర్యుడు ఉదయించడం ఏంటని అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమేనండి. మరి అర్థరాత్రి సూర్యుడు ఉదయించే ఆ ప్రాంతం ఏది? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఈ ప్రపంచంలోని భూమిపై చివరి దేశంగా ఉన్న స్వాల్బార్డ్‌లో ఆరు నెలలు పగలు, ఆ తర్వాత ఆరు నెలలు రాత్రి మాత్రమే ఉంటుంది. అయితే ఈ దేశంలో ఇదే కాకుండా అర్థరాత్రి కూడా సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకంటే నార్వేలోని ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీపం భూమిపై చివరి దేశంగా ఉంది. ఈ ఆరు నెలల రాత్రి సమయంలో సూర్యుడు భూమి నుంచి అదృశ్యమవుతాడు. దీన్నే పోలార్ నైట్ అంటారు. అంటే ఆరు నెలల రాత్రిని చూడాలంటే తప్పకుండా బైనాక్యులర్స్ కావాలి. చాలా మంది దీన్న ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్తుంటారు. అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్య వరకు ఇక్కడ రాత్రి ఉంటుంది. ఎంతో అందంగా, మనోహరంగా ఈ రాత్రి ఉంటుంది. ఈ సమయంలో ఆకాశం నీలం, ఊదా రంగులో బాగా కనిపిస్తుంది. పాల రాతిలా మెరిసే మంచు మీద సూర్యకాంతి పడటం వల్ల ఎంతో అందంగా ఉంటంది. చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఇక్కడి అందాలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.
ఇక్కడ రాత్రి పగలు అనే తేడా లేకుండా అందరి జీవితం, వ్యాపారం సాగుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కడ జరగని వింత.. అర్థ రాత్రి సూర్యుడు ఉదయించడం. స్వాల్బార్డ్ ద్వీపంలో ఏప్రిల్ మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తాడు. అర్థరాత్రి సూర్యుడు చాలా అందంగా కనిపిస్తాడు. అసలు చూడటానికి రెండు కన్నులు కూడా సరిపోవు. ఇక్కడి పగలు, రాత్రి జీవనం ఎలా ఉంటుందని, అలాగే రాత్రిపూట సూర్యోదయం అందాలు చూడటానికి చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అర్థ రాత్రి సూర్యోదయాన్ని చూడాలని చాలా మంది అనుకుంటారు. దీన్ని చూస్తే ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. భూమికి చివరి దేశం కావడం వల్ల ఇక్కడ మాత్రమే జరుగుతుంది.