Right To Property: తండ్రి వీలునామా రాయని ఆస్తి ఎవరికి చెందుతుంది?

సాధారణంగా తండ్రి ఆస్తి కుమారులకు చెందాలని 1956 హిందూ చట్టం తెలుపుతుంది. ఈ చట్టం ప్రకారం ప్రతీ ఆస్తిపై తండ్రి మరణం తరువాత అతని భార్య, లేదా కుమారులకు వర్తిస్తుంది. కానీ ఈరోజుల్లో ఆస్తుల వివాదాలు పెరిగిపోతున్నారు. సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కోర్టులకెక్కుతున్నారు. ఈ సమస్య ఉండకూడదనే హిందూ చట్టం ప్రకారం ఓ షెడ్యూల్ ను కేటాయించారు. ఆ షెడ్యూల్ గురించి తెలిస్తే ఎలాంటి వివాదాలకు పోనవసరం లేదు.

Written By: Chai Muchhata, Updated On : July 12, 2023 10:30 am

Right To Property

Follow us on

Right To Property: ప్రతీ తండ్రి తాను బతకడానికి, భవిష్యత్లో పిల్లలకు సపోర్టుగా ఉండేందుకు కొన్ని ఆస్తులు కూడబెడుతారు. కొందరు భూములు, ఇతర స్థిరాస్తులను సంపాదిస్తే.. మరికొందరు బ్యాంకులో డబ్బు వేసుకుంటారు. అయితే తండ్రి చనిపోయిన తరువాత ఈ ఆస్తులు ఎవరికి వస్తాయంటే..? అతని భాగస్వామికి లేదా వారసులైన కుమారులు, కుమార్తెలకు వర్తిస్తుంది. భవిష్యత్ లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో తండ్రి ఒక్కోసారి వీలునామా రాస్తారు. అయితే వీలునామా రాయకుండా తండ్రి ఆస్తిని కుమారులు పంచుకోవచ్చు. ఇదేలా సాధ్యం? అన్న సందేహం చాలా మందికి వస్తుంటుంది. అయితే దీనికో న్యాయపరమైన సొల్యూషన్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా తండ్రి ఆస్తి కుమారులకు చెందాలని 1956 హిందూ చట్టం తెలుపుతుంది. ఈ చట్టం ప్రకారం ప్రతీ ఆస్తిపై తండ్రి మరణం తరువాత అతని భార్య, లేదా కుమారులకు వర్తిస్తుంది. కానీ ఈరోజుల్లో ఆస్తుల వివాదాలు పెరిగిపోతున్నారు. సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కోర్టులకెక్కుతున్నారు. ఈ సమస్య ఉండకూడదనే హిందూ చట్టం ప్రకారం ఓ షెడ్యూల్ ను కేటాయించారు. ఆ షెడ్యూల్ గురించి తెలిస్తే ఎలాంటి వివాదాలకు పోనవసరం లేదు.

హిందూ చట్టంలోని షెడ్యూల్ క్లాస్ -1 ప్రకారం ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకున్నా ఆ ఆస్తికి భార్య, కుమారులను వారసులవుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇల్లు, పొలం, ఇతర భూములు ఉన్నట్లయితే వాటి విలువను లెక్కిస్తారు. ఈ విలువ ప్రకారం కుమారులు ఏది కావాలో వారికి కేటాయించి ఆస్తుల పంపకాలు చేస్తారు. అయితే కుమారులతో పాటు తల్లి కూడా ఆస్తులో వాటాదారురాలు అవుతుంది. ఈ తరుణంలో ఇద్దరు కుమారులు, తల్లి ఉంటూ ఆస్తులను మూడు వాటాలను చేస్తారు. ఒకవేళ కూతళ్లు ఉంటే వారికీ వర్తిస్తుంది.

1956 హిందూ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిని తన కుమారులకు మాత్రమే పంచాలని తల్లి నిర్ణయించుకుంటే ఆమె 125 సీఆర్పీసీ ప్రకారం పిల్లలు మేజర్లు వారి నుంచి మెయింటనెన్స్ గ్రాంట్ కోసం పిటిషన్ వేయొచ్చు. లేదా ఒప్పందం చేసుకోవచ్చు. అంటే ఆస్తిని తన కుమారులకు మొత్తం ఇచ్చే తాను జీవించడానికి గ్రాంట్ రూపంలో కోరవచ్చు. ఇలా తండ్రి వీలునామా రాయకున్నా ఆ ఆస్తి భార్యతో పాటు కుమారులకు వర్తిస్తుంది.