IPL 2022: ఐపీఎల్ 2022లో దాదాపుగా సగం మ్యాచ్‌లు ముగిశాయి. అయితే పలు జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం తీసికట్టుగా ఉంది. కోట్లు కుమ్మరించి ఎంతో నమ్మకంతో ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వారిలో 90 శాతం మంది చెత్తగా ఆడుతుండటం ఫ్రాంచైజీలకు మింగుడుపడటం లేదు. ఈ జాబితాలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన టీమ్ పరంగా చూస్తే సంతృప్తిగానే ఉన్నా.. సదరు ఫ్రాంచైజీ రూ.15 కోట్లు కుమ్మరించి రిటైన్ చేసుకున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆటతీరు మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగానూ కోహ్లీ విఫలమవుతున్నా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తాడని ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా ఉందంటే అతడి ప్రదర్శన ఏ లెవల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: AP Govt Using Recovery Money: రికవరీ డబ్బులనూ వదలని జగన్ ప్రభుత్వం.. ఇదేం తీరు బాబు..!
నిరాశపరుస్తున్న రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్లో ముంబై జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఆరు మ్యాచ్‌లలో రోహిత్ బ్యాటింగ్ యావరేజ్ 19 మాత్రమే. మరోవైపు ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీమ్‌గా పేరుపొందిన చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని కోట్లు కుమ్మరించి రిటైన్ చేసుకుంది. అయితే అతడు మాత్రం దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో అతడి బ్యాటింగ్ యావరేజ్ 17.40 మాత్రమే. ఇటు బ్యాటింగ్‌లో నిరాశపరిచినా అటు బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

గత ఏడాది దుబాయ్‌లో జరిగిన రెండో అంచె ఐపీఎల్ పోటీల్లో తన ఆటతీరుతో ఆకట్టుకుని నేషనల్ టీమ్‌లో చోటు సంపాదించిన ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ సైతం ఈ సీజన్లో నిరాశ పరుస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్‌పై నమ్మకంతో కోల్‌కతా ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన వెంకటేష్ అయ్యర్ 18.16 బ్యాటింగ్ సగటు మాత్రమే నమోదు చేశాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా మెరుపులు లేవు.
ఇక ఈ జాబితాలో యువబౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ఆర్సీబీ జట్టు కోహ్లీతో పాటు సిరాజ్‌ను కూడా రిటైన్ చేసుకుంది. అయితే సిరాజ్ ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిస్తున్నాడు. ఆరు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ రేటు 10.25గా ఉందంటే అతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
Also Read:Minister RK Roja: బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రోజా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చాడా..!
Recommended Videos