Electric Three Wheeler Factory : తెలంగాణ రాష్ట్రానికి ఓ భారీ ప్రాజెక్టు రాబోతోంది. ప్రపంచంలోనే తిపెద్ద ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ కంపెనీ ఫిస్కర్.. హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం దీని గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రారంభించిందని, ఇందులో భాగంగా తెలంగాణలో అతిపెద్ద త్రీ వీలర్ ఫ్యాక్టరీని ఫిస్కర్ ప్రారంభించబోతుందని తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడం శుభసూచకమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ ఫ్యాక్టరీని 150 మిలియన్ డాలర్లతో ప్రారంభించినున్నట్లు సమాచారం. ప్రతీ సంవత్సరం 2,40,000 ఎలక్ట్రానిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోనున్నారు. ఈ ప్లాంట్ తయారీతో దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం బిలిటీ కంపెనీ హైదరాబాద్ కు చెందిన గయాం మోటార్ వర్క్స్ తో కలిసి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేయనుంది. కాలిఫోర్నియాకు చెందిన బిలీటీ ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు కావడంతో ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహన ఫ్యాక్టరీ ఏర్పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రెండు సంవత్సరాల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రారంభించిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుందని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది బిలిటీ కంపెనీదే అతిపెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు.
తొలివిడతగా 13.5 ఎకరాల్లో ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. 18 వేల వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని బిలీటీ సంస్థ సీఈవో రాజా గాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా బిలిటీ సంస్థకు 15 దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. బిలిటీ తయారు చేసిన త్రిచక్ర వాహనం ‘టాస్క్ మాన్ ఆటో’ ను ఆమెజాన్, ఐకియా, బిగ్ బాస్కెట్, జొమాటో, ఫ్లిప్ కార్డ్ వంటి అనేక సంస్థలు వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నాయి. భారత్ లో వివిధ ప్రాంతాలను పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఈ కంపెనీ నిర్ణయించింది. దీంతో ప్రపంచలోనే అతిపెద్ద త్రీవీలర్ ఫ్యాక్టరీ తెలంగాణ సొంతమైంది.
Also Read: Koratala Siva- NTR: ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా !
Recommended Videos