AP Govt Using Recovery Money: బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడే వాలుతాయనే సామెత మీకు గుర్తుంది కదా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పని తీరు కూడా అలాగే ఉంది. ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ వాలిపోతోంది. వెంటనే ఆ డబ్బులను వాడేసుకుంటోంది. ఈ శాఖ, ఆ శాఖ అనే తేడాలు లేకుండా.. ఎక్కడ మనీ వాసన వచ్చినా వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిస్తూనే ఉన్నాం. వాటికి అద్ధం పట్టే విధంగా ఇప్పుడు మరో ఘటన జరిగింది.

సాధారణంగా దోపిడీలు, దొంగతనాల కేసుల్లో నేరగాళ్లతో సహా డ్బబులను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని జమ చేస్తుంటారు. కోర్టుల్లో ఎవరికైతే ఆ డబ్బులు తేలుతాయో వారికి అప్పగించాలి. ఇది రూల్. అయితే ఏపీలో గత కొద్ది నెలుగా స్వాధీనం చేసుకున్న డబ్బులను జమ చేస్తున్నారు తప్ప.. కోర్టులు తీర్పులు ఇస్తున్నా చెల్లింపులు మాత్రం చేయట్లేదు.
Also Read: Prashanth Kishore: పీకే.. ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ లోకి ఎందుకు వెళుతున్నారు?
అదేంటి స్వాధీనం చేసుకున్న డబ్బులను చెల్లించాలి కదా అంటే మాత్రం ప్రభుత్వ అధికారులు స్తబ్తుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే.. ఆ డబ్బులను ప్రభుత్వం ఎప్పుడో వాడేసుకుంటోంది. దీంతో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతున్నారు. జమ చేసిన సొమ్మును వెంట వెంటనే ప్రభుత్వం అవసరాలకు వాడేసుకుంటోంది. తిరిగి చెల్లించట్లేదు.

న్యాయస్థానాళ ఖాతాల్లో అలాగే.. న్యాయమూర్తుల ఖాతాల్లో జమ చేస్తున్న నగదును ప్రభుత్వం వాడుకోవడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎంతలా ఆర్థిక సంక్షోభం ఉందో చెబుతోంది. నగదును మళ్లించుకోవడంలో చూపిస్తున్న చొరవను.. చెల్లించడంలో మాత్రం చూపించట్లేదు జగన్ ప్రభుత్వం. సాధారణంగా ఏపీలోని కోర్టుల్లో నెలకు రూ.వంద కోట్ల దాకా కక్షిదారులకు చెల్లింపులు జరుపుతారు.
కానీ ఇప్పడున్న పరిస్థితుల్లో చెల్లింపులు చేయకపోవడంతో.. ఎంతో ఆశగా ఎదరు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే జగన్.. డబ్బుల కోసం మరీ ఇంతలా దిగజారాలా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తే గనక జగన్ ప్రభుత్వం పరువు పోవడం ఖాయం.
Also Read:Minister RK Roja: బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రోజా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చాడా..!
Recommended Videos
[…] […]
[…] […]
[…] Punjab: మనం చాలా వార్తల్లో వింటూనే ఉంటాం. గోడకూలి కూలీల మృతి, అగ్ని ప్రమాదంలో దహనమైన కూలీలు.. ఇలాంటివి ఎన్నోవిన్నాం కదా. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి హృదయ విదాకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవేమో. వారంతా పొట్టకూటి కోసం చెత్త ఏరుకునే వారు. రోజంతా చెత్త ఏరుకుని.. అదే చెత్త కుప్పల పక్కన వేసుకున్న గుడిసెల్లో పడుకుంటారు. […]
[…] Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడు పదులు దాటేశాడు. తాజాగా ఆయన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దేశ రాజకీయాల్లోని ఉద్దండ రాజకీయ నేతగా బాబు ఎదిగారు. ఇప్పుడు టైం బ్యాడ్ అయిపోయి సైలెంట్ అయ్యారు కానీ.. ఒకప్పుడు ఉమ్మడి ఏపీ సీఎంగా రాష్ట్రపతులను,ప్రధానులను డిసైడ్ చేసిన ఘనత మన ‘బాబు’ గారి సొంతం. చంద్రబాబు 40 ఇయర్స్ పైగా పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు కు అంటిన మరకలు.. ఆయన సాధించిన.. […]
[…] YS Sharmila: ఆంధ్రా వద్దని తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల శపథాలు బ్రేక్ తీసుకుంటున్నాయి. అదేనండి.. ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తోంది కదా.. ఆ యాత్రకు మరోసారి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్తోందని సమాచారం. ఎండలు దంచికొడుతున్నాయనో మరే ఇతర కారణమో తెలయదు గానీ.. సడెన్‌గా అమెరికా టూర్ వేసింది షర్మిలమ్మ. […]
[…] Telangana Police: ‘పోలీస్ నెత్తిన కనిపించే మూడు సింహాలు నీతికి, నిజాయతీకి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ ఇది పోలీస్ పౌరుషాన్ని తెలిపే ఓ సినిమా డైలాగ్. నిజానికి పోలీసులు నేరస్తుల పాలిట సింహ స్వప్నాలే. ప్రజల ప్రాణ, మానాలు కాపాడడం.. శాంతిభద్రతల పరిరక్షణ వారి విధి. కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయతీతో పనిచేస్తామని యూనిఫాం వేసుకున్ననాడే ప్రమాణం చేస్తారు. రాగద్వేషం, భయం లేకుండా పనిచేస్తామని ప్రతినబూనుతారు. తెలంగాణ పోలీసుల్లో కొందరు ప్రమాణాలు విస్మరిస్తున్నారు.. కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయతీ, న్యాయం, అన్యాయాలను పట్టించుకోవడం లేదు.. గులాబీ నేతలకు వంగివంగి సలాం చేస్తున్నారు. ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతల ఒత్తిడిత భక్షకులుగా మారుతున్నారు. చట్టం తమ చేతుల్లో ఉందని అధికారం చెలాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చను తెలుస్తున్నారు. పదోన్నతులు, బదిలీలు, లంచాల కోసం అధికార పార్టీ నేతల చెప్పు చేతల్లో పనిచేస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు. […]
[…] […]