Late Marriage Problems: ప్రతి మనిషి జీవితంలో పెండ్లి అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పటి తరంలో యువత చాలా లేటు వయసులో పెండ్లి చేసుకుంటున్నారు. 30 నుంచి 40 ఏండ్లు వచ్చిన తర్వాత పెండ్లి చేసుకుని దాంపత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెండ్లి చేసుకునేందుకు ఇప్పటి యువత ఇష్టపడుతున్నారు.

దీంతో వారు సెటిల్ అయ్యే సరికి 30 నుంచి 35 ఏండ్లు దాటిపోతున్నాయి. దీంతో వారికి ఆ వయసులో పిల్ల దొరకడం కూడా కష్టమే అవుతోంది. ఒకవేళ దొరికినా కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా లేటు వయసులో పిల్లల్ని కంటే.. ఆ పిల్లలు పెరిగి 20ఏండ్లు వచ్చేసరికి తల్లిదండ్రులకు 60ఏండ్లు వచ్చేస్తున్నాయి.
Also Read: AP New Disticts: ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే.. 4వ తేదీ నుంచే అమలు.. ఫుల్ డీటైల్స్
మానవ జీవన శైలి ప్రకారం పిల్లలపై తల్లిదండ్రులు ఆధారపడే వయసులో.. పిల్లలే తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితులు వస్తున్నాయి. తల్లి దండ్రులు వృద్ధులు అయ్యే సమయానికి కూడా పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉంటారు. దాంతో తల్లిదండ్రులకు వారి కుటుంబ పోషణ చాలా కష్టం అయిపోతుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడితే.. ఆ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి.
సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. లేటుగా పిల్లల్ని కంటే వారు సమృద్ధిగా, పూర్తి ఆరోగ్యంగా ఉండట్లేదంట. 25 నుంచి 30 ఏండ్ల లోపు పిల్లల్ని కంటేనే వారు ఆరోగ్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. పైగా లేటు వయసు వచ్చే దాకా సెక్స్‌కు దూరంగా ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. రోజూ సెక్స్ చేసే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారంట.

బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకునే వారికి పెండ్లిలో ఏముందనే ఆలోచనలు వస్తాయి. అంటే జీవితంలో అన్ని తాము అనుకున్నట్టు చేసే సమయంలో.. భార్య భర్త నుంచి పెద్దగా ఏమీ ఆశించదు. అలాంటప్పుడు వీరిద్దరి మధ్య మామూలుగానే గొడవలు ఎక్కువగా వస్తాయి. భార్యకు భర్త, భర్తకు భార్య అవసరం ఉన్న యుక్త వయసులోనే పెండ్లి చేసుకుంటే.. వీరిద్దరి మధ్య రిలేషన్ చాలా బలంగా ఉంటుంది.
అంతే గానీ.. ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ తర్వాత పెండ్లి చేసుకుంటే.. ఇద్దరి మధ్య సయోధ్య కుదరదు. ఎవరికి వారే ఫ్రీడమ్‌ను కోరుకుంటారు. మన దేశంలో విడిపోయే వారిలో లేటు వయసులో పెండ్లి చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారంట. కాబట్టి లేటు జీవితంలో అడ్జస్ట్ కాలేక లేటు వయసులో పెండ్లి చేసుకోవడం కంటే.. యుక్త వయసులోనే పెండ్లి చేసుకుని సంసారంలో అడ్జస్ట్ అయితే బెటర్.