Analysis on Unicorns in India: భారత్ నుంచి ధనవంతులు వెళ్లిపోతున్నారు. ప్రజాస్వామ్యం లేని దేశాలైన చైనా, రష్యాల నుంచి వెళుతున్నారంటే దానికి ఓ కారణముంది. ఎందుకంటే అవి కమ్యూనిస్ట్ దేశాలు. కానీ ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి ధనవవంతులు వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. హెచ్1 బి వీసా కింద నిపుణులైన ఉద్యోగులు వెళ్లడం కామనే. కానీ ధనవంతులు ఇలా వెళ్లడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

భారత్ నుంచి విదేశాలకు ఎక్కువగా వెళుతున్నది అందరూ అనుకుంటున్న అమెరికాకు కాదు.. ఇది షాక్ కలిగించే విషయమే అయినా నిజంగా నిజం. భారత్ నుంచి అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో నంబర్ 1 పోర్చుగీసు ఉంది. నంబర్ 2 ఆస్ట్రేలియా. నంబర్ 3 అమెరికా, నంబర్ 4 ‘మాల్టా’ దేశానికి వెళుతున్నారు. నంబర్ 5 గ్రీస్ దేశం ఉంది.
ఇందులో నాలుగు దేశాలు యూరప్ కంట్రీలే. ఆ దేశాల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వ్యాపారులకు గ్రీన్ కార్డు పౌరసత్వం ఇస్తారు. అందుకే భారతీయ వ్యాపారులు ఆ దేశాల్లో పెట్టుబడి పెట్టి అక్కడికి వలస వెళుతున్నారు.
అమెరికాకు అయితే ఖచ్చితంగా బిజినెస్ డెవలప్ మెంట్ కోసమే వెళతారు. ఇక పోర్చుగీసు దేశం ఎక్కువ పెట్టుబడి పెట్టకున్నా గోల్డెన్ వీసా ఇచ్చి ధనవంతులను ఆకర్షిస్తోంది. ఇక ఆస్ట్రేలియా అయితే అత్యంత స్కిల్డ్ నిపుణులు అయితే చాలు ఆ కుటుంబానికి మొత్తం గోల్డెన్ వీసా ఇచ్చి ఆకర్షిస్తోంది. అందుకే అత్యధికంగా ఈ దేశాలకు భారతీయ ధనవంతులు వలస వెళుతున్నారు. ఆ దేశాలు మనవాళ్లను ఇలా ఆకర్షిస్తున్నాయి. కానీ ప్రజాస్వామ్య ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు వెళుతున్నారు? దానికి కారణాలేంటనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] Banks Report Frauds Worth rs 34000 Crore: దేశంలో బ్యాంకుల్ని మోసం బడాబాబుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ఆర్బీఐ నివేదికలో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నివేదిక ప్రకారం చూస్తే కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉండటం తెలిసిందే. […]