Relationship: భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరి భార్యలతో కలిసి ఉన్నా కూడా ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. కానీ ఎందుకో ప్రతి చిన్న విషయానికి ప్రస్తుతం చాలా గొడవలు పెట్టుకుంటున్నారు ఈ కాలం భార్యాభర్తలు. భర్త అంటే భార్యకు నచ్చదు. భార్య అంటే భర్తకు నచ్చదు. కొన్ని రోజుల్లోనే విడాకులు. ఇలా చెప్పుకుంటే పోతే పెళ్లి అంటే భయపడే సంఘటనలు చాలానే ఉంటాయి.
అయితే భార్యకు అత్త అంటే నచ్చదు. అత్తకు కోడలు అంటే నచ్చదు. ఈ ఇద్దరి మధ్యలో భర్త/కొడుకు నలిగి పోతుంటాడు. పెళ్లి అయ్యే వరకు కని పెంచి పోషించి ఒక అమ్మాయికి కావాల్సినట్లు అన్ని విధాలుగా తయారు చేసిన ఆ తల్లికి కాస్త సపోర్ట్ గా మాట్లాడితే భార్యకు కోపం. ఎవరో తెలియకుండా, తనే జీవితం అని నమ్ముకొని వచ్చిన భార్య గురించి కాస్త పొగిడితే తల్లికి కోపం. అందుకే ఇద్దరు కూడా సహనం, ఓపికతో ఉంటే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది.
కొన్ని విషయాల్లో భార్యకు ప్రధాన్యత ఇస్తే.. కొన్ని సందర్బాల్లో తల్లిదండ్రికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం లేవగానే భార్యను కాఫీ, టీ అడిగితే ఇన్ని రోజులు నా చేతితో కాఫీ తాగేవాడు. కోడలు వచ్చి మార్చింది అంటారు కొందరు అత్తలు. కానీ భార్య కాఫీ ఇవ్వడంలో తప్పు లేదు. ఇలాంటి చిన్న విషయాలకు మనస్పర్థాలు తెచ్చుకోవడం వల్ల గొడవలు మొదలు అవుతాయి. 25 సంవత్సరాలు కాపీ ఇచ్చిన ఆ తల్లి ఇక రెస్ట్ తీసుకోవచ్చు. అంతేకానీ కోడలి మీద కోపం పెంచుకోకూడదు. భార్యకు కొన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంటారు నిపుణులు.
కొన్ని విషయాలను భార్యతో అడిగి చేయాలి? ఉద్యోగం చేయాలా మానేయాలా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలా? కంటిన్యూ చేయాలా? వంటి కొన్ని ప్రశ్నలకు భార్య వద్ద సమాధానం దొరుకుతుంది. కానీ ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తల్లితోనే మాట్లాడటం కరెక్ట్ కాదు అంటారు నిపుణులు. ఎవరితో మాట్లాడాల్సినవి వారితోనే మాట్లాడాలి. లేదంటే సఖ్యత లోపిస్తుంది. అందుకే తల్లికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తల్లికి, భార్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత భార్యకు ఇవ్వాల్సిందే.