Chandrababu Vs Jagan: జగన్ కి బాబు ట్రాప్

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోకుండా బిజెపి, జనసేనతో పెట్టుకున్నారు.తక్కువ సీట్లతోనే పొత్తు సాధించగలిగారు. గత నాలుగు సంవత్సరాలుగా పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోయేసరికి వైసిపిదే పై చేయిగా నిలిచింది.

Written By: Dharma, Updated On : April 11, 2024 2:51 pm

Chandrababu Vs Jagan

Follow us on

Chandrababu Vs Jagan: ఎన్నికల్లో జగన్ ను అచేతనం చేసి ఓడించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. గత ఎన్నికల్లో జగన్ కు కలిసి వచ్చిన అంశాలన్నింటినీ చంద్రబాబు లాక్కునే ప్రయత్నం చేశారు.గతం మాదిరిగా సహకారం అందించకుండా నిలువరించగలిగారు.కుటుంబంలో అడ్డగోలు చీలిక తెచ్చారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా పొత్తులు పెట్టుకున్నారు. అటు జగన్ అనుకూల ఓటు చీల్చేందుకు కాంగ్రెస్ ను ప్రయోగించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తెచ్చి.. ఏపీలో యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోకుండా బిజెపి, జనసేనతో పెట్టుకున్నారు.తక్కువ సీట్లతోనే పొత్తు సాధించగలిగారు. గత నాలుగు సంవత్సరాలుగా పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోయేసరికి వైసిపిదే పై చేయిగా నిలిచింది.కానీ ఆ ఎత్తులను చిత్తు చేస్తూ చంద్రబాబు పొత్తు సాధించగలిగారు. అదే సమయంలో జగన్ కుటుంబంలో చీలిక చేయగలిగారు. వైయస్ హత్యఅంశాన్ని షర్మిల, సునీతలతో ప్రశ్నించి జగన్ ను ఇరుకును పెట్టగలిగారు. వైయస్ అభిమానుల ఓట్లలో చీలిక తేగలిగారు.

అయితే ఇప్పుడు మరో స్కెచ్ వేస్తున్నారు. జగన్ కు అండగా నిలిచే అధికారులను టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు డిజిపిని మార్చాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి.. వైసీపీకి సహకరిస్తున్నారన్న ఆరోపణతో సీఎస్ జవహర్ రెడ్డి, డిజీపి రాజేంద్రనాథ్ రెడ్డిలను మార్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని అస్సాం క్యాడర్ కు పంపించగలరు. ఇప్పుడు సిఎస్ తో పాటు డిజిపి లను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నింటికి మించి డిజిపిగా ఏబీ వెంకటేశ్వరరావును తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేసిన వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ వెంటాడిన సంగతి తెలిసిందే. ఆయన సీనియార్టీని పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అదే సాకు చూపి డిజిపిగా ఏబి వెంకటేశ్వరరావును తేవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా దాదాపు జగన్ టీంకు చెక్ చెప్పాలని చూస్తున్నారు. అదే జరిగితే జగన్ పూర్తిగా చంద్రబాబు ట్రాప్ లో పడినట్టే.