Registration certificate : వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ జారీ చేస్తుంది. దీనిలో వాహనం నెంబర్, ఆ వాహన యజమాని వివరాలు, ఆ వాహన రకం మరియు ఆ వాహన తయారీ సంవత్సరం వంటి సమాచారం ఉంటుంది. ఒకవేళ మీ వాహన ఆర్సి కోల్పోయిన లేదా దెబ్బతిన్నా కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం డూప్లికేట్ ఆర్సిని పొందడం చాలా సులభమైన ప్రక్రియ. ఇంటి నుంచే డూప్లికేట్ ఆర్ సి ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వాహన యజమానికి తప్పకుండా ఉండాల్సిన డాక్యుమెంట్ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ వాహన చట్టబద్ధతను నిరూపిస్తుంది. ఒకవేళ మీ ఆర్సి పోయినట్లయితే లేదా దెబ్బ తిన్నట్లయితే మీరు ఇంటి నుంచే డూప్లికేట్ ఆర్ సి ని అప్లై చేసుకోవచ్చు. ఇలా డూప్లికేట్ ఆర్సిని పొందడం వలన మీరు మీ వాహనాన్ని చట్టపరమైన ఇబ్బందుల నుంచి సేఫ్ గా ఉంచుకోవచ్చు. గతంతో పోలిస్తే డూప్లికేట్ ఆర్సిని పొందడం ఇప్పుడు చాలా సులభమైన పని. సరైన డాక్యుమెంట్లను జోడించి మీరు ఆర్టీవో ని సంప్రదిస్తే లేదా ఆన్లైన్ విధానంలో సేవలను వినియోగించుకుంటే త్వరగా మీ ఆర్సిని పొందవచ్చు. మీ వాహనానికి చట్టబద్ధత ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ మీ వెంట ఉండేలాగా చూసుకోవాలి.
Also Read : క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి ఆర్.బి.ఐ సంచలన ప్రకటన..
ఒకవేళ మీ ఆర్సి పోయినట్లయితే మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను ఫైల్ చేయండి. ఈ ఎఫ్ ఐ ఆర్ ను మీరు డూప్లికేట్ ఆర్ సి కోసం అప్లై చేస్తున్న సమయంలో సమర్పించాల్సి వస్తుంది. దరఖాస్తు ఫారం తో పాటు ఎఫ్ఐఆర్ కాపీ, వాహన యజమాని గుర్తింపు పత్రం, అడ్రస్ ప్రూఫ్, వాహన ఇన్సూరెన్స్ కాపీ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో సంబంధిత వివరాలను తెలపాలి. మీకు సమీపంలో ఉన్న రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లి ఫారం 26 ని సమర్పించాలి.
అన్ని డాక్యుమెంటులను జోడించి నిర్ణీత రుసుమును చెల్లించాలి. రాష్ట్రాన్ని బట్టి రుసుము మారుతుంది. ప్రస్తుతం చాలా ఆర్టీవోలు ఆన్లైన్ సేవలను కూడా అందిస్తున్నాయి. మీరు వాహన పోర్టల్ ద్వారా డూప్లికేట్ ఆర్సిని అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ లో మీరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి. మీరు అప్లై చేసిన తర్వాత ఆర్టీవో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత డూప్లికేట్ ఆర్ సి మీ చిరునామాకు వస్తుంది.
Also Read : తాజాగా ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బిఐ.. కోట్లాది మందికి ఊరట..