RBI : ఫిబ్రవరి నెలలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా 0.25% తగ్గించడం జరిగింది. దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని కోట్లాదిమంది ప్రజలకు రుణ ఈఎంఐ లలో ఉపసనం కల్పించేందుకు ద్రవ్య విధాన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ వరుసగా రెండవసారి కూడా రిపోర్టును 0.25 శాతం తగ్గించింది. ఈ క్రమంలో రెపోరేటివ్ 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గడం జరిగింది. సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పడుతున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నిర్ణయం వచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం తర్వాత ప్రపంచ దేశాలలో ద్రవయోల్బణం మరియు మాంద్యం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి వెళ్లే అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ మెరుగైనదిగా తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు 0.25% కోతను సిఫార్సు చేయడం జరిగింది. ఈ క్రమంలో రెపోరేటును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వరుసగా రెండోసారి ఆర్బిఐ పాలసీ రేటును తగ్గించడం జరిగింది. గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన పాలసీ సమావేశంలో వడ్డీ రేటును 0.25 శాతానికి ఆర్బిఐ గవర్నర్ తగ్గించారు. మళ్లీ ఈ తగ్గింపు దాదాపు 5 సంవత్సరాల తర్వాత అంటే 56 నెలల తర్వాత కనిపిస్తుంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ వ్యవస్థలో గృహ రుణాలు, వాహన రుణాలు మరియు రిటైల్ రుణాల ఖర్చు తగ్గుతుంది. రియల్ రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. గత కొన్ని రోజుల నుంచి మాంధ్యము ఎదుర్కొంటున్న ఈ రంగంలో ఇళ్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే మార్చి నెలకు సంబంధించిన ద్రవయోల్బన గణాంకాలు ఇప్పటివరకు వెల్లడి కానప్పటికీ ఫిబ్రవరి నెలలో దేశ ద్రవయోల్బణం నాలుగు శాతం కంటే తగ్గినట్లు తెలుస్తుంది. దేశ రిటైలర్ ద్రవయోల్బణం ప్రస్తుతం 3.6% గా ఉంది. ఏడు నెలలలో ఇది కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఆహార ద్రవయోల్బణం తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక నిపుణుల అంచనా ప్రకారం ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవయోల్బణం నాలుగు శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
Also Read : ఆర్‌బీఐ నుంచి కొత్త అప్‌డేట్.. రూ.500, రూ.10 కొత్త నోట్లు.. మరి పాతవి?