Jack : సినిమా ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోకపోయిన, కేవలం హీరో బ్రాండ్ ఇమేజ్ మీద ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి. ఈరోజు విడుదలైన ‘జాక్'(Jack Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. పాటలు బాగుంటే కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటారు ఆడియన్స్, అదే పాటలు బాగాలేకపోతే అసలు పట్టించుకోరు కూడా. అలాంటి పరిస్థితిలో కూడా కేవలం తనకి ఉన్న క్రేజ్ తో ‘జాక్’ సినిమాకు టికెట్స్ ని అమ్ముడుపోయేలా చేస్తున్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో ఈయన బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాకుండా, యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బ్రాండ్ ఇమేజ్ నేడు జాక్ చిత్రాన్ని కాపాడింది. ఒక్క సాంగ్ కూడా ఆడియన్స్ లో క్లిక్ అవ్వలేదు, ట్రైలర్ కూడా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లోనే ఉన్నింది.
Also Read : ‘జాక్’ మూవీ ట్విట్టర్ టాక్..సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా!
అయినప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుందంతే ఇది కచ్చితంగా సిద్దు క్రేజ్ కి ఒక కొలమానం అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం కూడా బాగా కలిసొచ్చింది. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు మూడు వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ లో భారీ జంప్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల షేర్ ని అందుకోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయితేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక భారీ అంచనాల నడుమ విడుదలైతే ఏ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చేవో అని ట్రేడ్ పండితులు మాట్లాడుకుంటున్నారు.
సాధారణంగా గురువారం రోజున సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు కాస్త తడబడుతూ ఉంటారు. ఎందుకంటే మిడ్ వీక్ రిలీజ్ లో పొరపాటున టాక్ రాకపోతే మార్నింగ్ షోస్ నుండే వాష్ అవుట్ అయిపోతాయి అనేది వాళ్ళ భయం. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే మిడ్ వీక్ రిలీజ్ లు ఉంటాయి. అలాంటిది సిద్దు జొన్నలగడ్డ ధైర్యం చేసి నేడు ఈ చిత్రాన్ని విడుదల చేయడమే కాదు, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకొని మంచి ఓపెనింగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. కచ్చితంగా ఈ చిత్రం మొదటి వారం లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు విడుదల అయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుందో చెప్పలేము కానీ, ఒకవేళ వాటికి టాక్ రాకపోతే మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ‘జాక్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!