Mammootty: మొత్తానికి సినిమా వాళ్లకు కరోనా భారీ సినిమానే చూపిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ రోజు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మమ్ముట్టి ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతి త్వరలో తిరిగి జన లోకంలో వస్తాను అంటూ ప్రస్తుతం మమ్ముట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నిజానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా విషయంలో మొదటి నుంచీ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయం పై ఆయన స్పందిస్తూ.. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. నాకు కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయినట్లు తెలిపారు. ప్రజలంతా మాస్క్ ధరించి క్షేమంగా ఉండాలని ఆయన కోరారు.
Also Read: టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఆయనే..!
మమ్ముట్టి ‘యాత్ర’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది. ప్రస్తుతం ఆయన ఖాతాలో భారీ క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందుకే
మమ్ముట్టికి కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయా సినిమాల మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. అలాగే స్టార్ హీరో మోహన్ లాల్ కి కూడా టెన్షన్ మొదలైంది. మోహన్ లాల్ ను, దర్శకుడు ప్రియదర్సన్ ను రెండు రోజుల క్రితం మమ్ముట్టి ప్రత్యేకంగా కలిశాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు. సడెన్ గా షూటింగ్స్ కూడా ఆపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే, చాలా సినిమాలు మధ్యలోనే షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి.