Zodiac signs: సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు కలుగుతాయి , వారి జాతక చక్రాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది వారి రాశులను చూసుకొని వారి జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుంటారు.అయితే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా మంది వారిలో ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ ప్రేమలో సంతోషంగా ఉంటారు. అయితే ఈ ఏడాది ఏ రాశుల వారికి వారి ప్రేమ విషయంలో ఎలా ఉండబోతుంది ఎవరు సక్సెస్ అవుతారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
మేషం: మేష రాశి వారు ఇప్పటి వరకు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ ఈ ఏడాది మాత్రం ఈ విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే మీ ప్రేమను కూడా విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తారు.
వృషభం: మామూలుగానే వృషభ రాశి వారికి కాస్త ఇగో ఎక్కువ. జనరల్ గా వృషభ రాశి వారు వారికి వారే ఎక్కువ గౌరవం ఇచ్చుకుంటారు.అలాంటి వృషభ రాశి వారు వారి ఇగోని కాస్త పక్కన పెట్టి వారి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడంతో జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు.
మిధునం: మిథున రాశి వారికి ఈ ఏడాది మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వారి రిలేషన్షిప్ లో చాలా పీస్ ఫుల్ గా ఉంటూ ప్రశాంతంగా వారి జీవితాన్ని గడుపుతారు. మిమ్మల్ని ఎంతో అద్భుతంగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామికి దొరుకుతారు.
కర్కాటకం: కర్కాటక రాశి వారిలో ఈ ఏడాది పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటివరకు ఎంతో చిలిపిగా చిన్నపిల్లల మనస్తత్వంతో మెలిగేవారు కాస్త ఇకపై బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. తమకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయని గుర్తించడంతో వీరి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విధమైనటువంటి మార్పులు రావటం వల్ల వీరి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
సింహం: సింహ రాశి వారు ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారికి ఎవరితోనైనా గొడవలు మనస్పర్థలు కనుక ఉంటే వాటిని ఏడాది పరిష్కరించుకోవాలి లేదంటే జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది అది ఇతరుల విషయంలో అయినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
కన్య: కన్య రాశి వారికి ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఉంది చాలా సరదాగా ఆడుతూపాడుతూ గడిపేస్తారు.ఇక ఈ రాశివారు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే చాలా క్రియేటివ్ గా వారికి ప్రపోజ్ చేయడం వల్ల మీ జీవితం కూడా ఎంతో సంతోషంగా సాగిపోతుంది.
తుల: తులారాశి వారికి ఏడాది ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రాశి వారు గత కొద్దిరోజుల నుంచి ఇతరులకు ప్రపోస్ చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ బయటకి చెప్పలేదు. అలాంటి ఆలోచన ఉన్నవారు ఈ ఏడాది ప్రేమలో సక్సెస్ అవుతారు.
Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఎంతో బాగుంది అయితే ఇప్పటివరకు మీకు ఎవరైనా ప్రేమను వ్యక్తపరిస్తే మీరు చాలా వరకు రిజెక్ట్ చేస్తూనే వుంటారు. కానీ ఈ ఏడాది ఎవరైనా మీకు వారి ప్రేమను వ్యక్తపరిస్తే వారి ప్రేమకు అంగీకారం తెలపడంతో మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ధనస్సు: ధనస్సు రాశి వారు ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావనలో ఉంటారు ఆ భావన నుంచి బయటకు వచ్చి అందరూ సమానమే అని భావించినప్పుడు వీరి జీవితం కూడా ఎంతో బాగుంటుంది.
మకరం: మకర రాశి వారికి కోపం ఎక్కువ అందుకే చాలా ఓపిక సహనంతో ఉండాలి లేదంటే లవ్ రిలేషన్ షిప్ మాత్రమే కాకుండా చాలా రిలేషన్షిప్ కోల్పోవలసి వస్తుంది. అందుకే ఈ రాశి వారు ఎంతో సహనంతో ఓర్పుతో ఉండాలి లేదంటే ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది.
Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
కుంభం: కుంభ రాశి వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీరు తమ కుటుంబ సభ్యులతో లేదా లవ్ లో ఉన్నప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండటం వల్ల రిలేషన్ షిప్ ఎంతో మంచిగా కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఉంది.
మీనం: మీన రాశి వారికి ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఉంది. అయితే ఇచ్చిన మాటపై నిలబడటం వల్ల మీ ఫ్యామిలీ రిలేషన్స్ లేదా లవ్ రిలేషన్ లో ఎంతో సంతోషంగా ఉంటారు.
Also Read: 24 గంటల్లోనే ఇద్దరిని లేపిన జగన్..డీజీపీ, సీఎంవో కార్యదర్శి బదిలీలకు అసలు కారణం అదే?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Propose to these zodiac signs and your love will surely sucess
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com