Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు ఉన్న వ్యక్తి. శత్రువుకి కూడా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. ఈ కరోనా కాలంలో మెగాస్టార్ చేసిన సేవ మరో హీరో చేయలేదు. ముఖ్యంగా సినిమా నటీనటులకు జూనియర్ ఆర్టిస్ట్ లకు ఆయన ఎంతో సేవ చేశారు. ఎన్నో దానాలు చేశారు. ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణిడికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ ఆకలి కడుపులకు అన్నం పెట్టారు.

కానీ “మా” ఎన్నికల్లో ఆ నటీనటులు ఎవ్వరూ చిరంజీవి పై విశ్వాసం చూపించలేదు. చిరు మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ని ఓడించి.. ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిని ఓడించారు. మెగాస్టార్ దగ్గర సాయం తీసుకున్న వారు కూడా చిరంజీవి వైపు నిలబడలేదు అంటే.. తప్పు ఎవరిది ? చిరంజీవి స్వయంగా తాను ప్రకాష్ రాజ్ ని నిలబెట్టాను అని చెప్పలేని చిరంజీవిదా ?
లేక ఇష్టం వచ్చినట్టు వాగి ప్రకాష్ రాజ్ ఓటమికి ప్రధాన కారణం అయిన నాగబాబుదా ? ఏది ఏమైనా ఈ ఎన్నికలు చిరు పై విమర్శలకు కారణం అయ్యాయి. మెగా అభిమానులే సోషల్ మీడియాలో చిరు పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రకాష్ రాజ్ ని ముందుకు తోసి, వెనకనుండి చేసిందంతా చేసి ఇప్పుడు కథలు చెప్పు చిరంజీవి’ అని ఒకరు,
‘విష్ణు గెలుపుకు ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమైన మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ తమ్ముడు నాగబాబుకి శుభాకాంక్షలు చిరంజీవిగారు’ అంటూ మరొకరు, ‘ఒక మంచి వాడిని గెలిపించలేకపోయినా మీ మంచితనం దేనికి ? అందరూ వచ్చి ఒక్కడిని దెబ్బ కొడుతుంటే నువ్వు మా వ్యవస్థాపకుడు ఉండి ఏం చేస్తున్నావ్ ?’ అంటూ ఇంకొకరు ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. .
నిజమే ప్రకాష్ రాజ్ పై లోకల్, నాన్ లోకల్ లాంటి విమర్శలు వచ్చిన సమయంలోనైనా ఒక వీడియో ద్వారానో, కనీసం ఒక ట్వీట్ ద్వారానో ప్రకాష్ రాజ్ కి మద్దతు ప్రకటించి ఉంటే ఎంత బాగుండేది ? కానీ చిరు మౌనంగానే ఉండిపోయారు.