Homeఎంటర్టైన్మెంట్Geethu Royal Team Overaction in Tirumala: పవిత్రమైన తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్, తన...

Geethu Royal Team Overaction in Tirumala: పవిత్రమైన తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్, తన స్నేహితులతో చేసిన ఘోర పాపం..వీడియో వైరల్!

Geethu Royal Team Overaction in Tirumala: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు , యూట్యూబర్లు వ్లాగ్స్ పేరుతో పవిత్రమైన తిరుమల ని బ్రష్టు పట్టించేస్తున్నారు. అప్పట్లో ప్రముఖ సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమల కొండపై చేసిన వ్లాగ్ వైరల్ అయ్యి ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీటీడీ ఆమె పై ఫైర్ అయ్యింది. పోలీస్ కేసు కూడా […]

Geethu Royal Team Overaction in Tirumala: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు , యూట్యూబర్లు వ్లాగ్స్ పేరుతో పవిత్రమైన తిరుమల ని బ్రష్టు పట్టించేస్తున్నారు. అప్పట్లో ప్రముఖ సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమల కొండపై చేసిన వ్లాగ్ వైరల్ అయ్యి ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీటీడీ ఆమె పై ఫైర్ అయ్యింది. పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది . చివరికి ఆమె తన కాబోయే భర్త తో కలిసి స్పెషల్ గా వీడియో చేస్తూ తిరుమల భక్తులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత యాంకర్ శివ జ్యోతి, లేటెస్ట్ గా హీరోయిన్ శివాని నాగారం వంటి వారు ఇలాగే చేసి తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి గీతూ రాయల్ కూడా చేరిపోయింది.

సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి ఈమె ఎవరో తెలిసే ఉంటుంది. యూట్యూబర్ గా బాగా పాపులారిటీ సంపాదించిన ఈమె, జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ ద్వారా ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి చేసిన రచ్చ ఎలాంటిదో అంత తేలికగా ఆడియన్స్ మర్చిపోలేరు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత, బిగ్ బాస్ తదుపరి సీజన్స్ కి రివ్యూస్ చెప్తూ ఇంకా బాగా ఫేమస్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా తిరుమల కి వెళ్లిన గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. పుష్కరిణి సమీపంలోని తిరుమల ఘాట్ రోడ్డులో ఆమె తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసింది.

Also Read: పెళ్లి తర్వాత అభిమానులకు విజయ్ దేవరకొండ, రష్మిక స్వీట్ సర్ప్రైజ్..వీడియో వైరల్!

ఆ ఘాట్ రోడ్డు ఎదురుగా తిరుమల శ్రీవారి ఆలయం ఉంది , పక్కనే కౌంటర్లు కూడా ఉన్నాయి. టీటీడీ రూల్స్ ప్రకారం ఇలాంటివి చేయడం ఇక్కడ నిషేధం . కానీ వీళ్ళు అవేమి పట్టించుకోకుండా రీల్స్ చేయడమే కాకుండా, వాటిని ఎంతో ధైర్యం గా సోషల్ మీడియా లో అప్లోడ్ కూడా చేశారు . ఈ వీడియో పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఖడ్గం చిత్రం లో రవితేజ దేవుడిని కోరికలు కోరుతూ పాడే ‘గోవిందా గోవిందా ‘ పాటని అనుకరిస్తూ వీళ్ళు ఈ రీల్ చేశారు. సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper