https://oktelugu.com/

Pot Water : మట్టి కుండలో నీరే ఎందుకు తాగాలి? ఫ్రిజ్ నీరు ఎందుకు తాగొద్దు?

రిఫ్రిజిరేటర్ నీరు మోతాదు కంటే ఎక్కువగా చల్లగా ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 28, 2024 / 06:04 PM IST

    Pot water in summer

    Follow us on

    Pot Water :  వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఉష్ణోగ్రత నుంచి తట్టుకోవడానికి చల్లటి సాధనాలను ఏర్పరుచుకుంటారు. సమ్మర్ లో ఎక్కువగా శరీర డీ హైడ్రేషన్ కు గురవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని నీరు చెమట ద్వారా బయటకు త్వరగా వెళ్లిపోవడం వల్ల దాహం ఎక్కువగా అవుతుంది. ఈ సమయంలో సాధారణ నీరు తాగడం వల్ల దాహం తీరదు. కడుపు నిండినా నాలుక మాత్రం నీటిని కోరుతుంది. దీంతో చల్లటి నీరు తాగడం వల్ల తృప్తి అవుతుంది. అయితే ఎలాంటి చల్లటి నీరు తీసుకోవాలి? ఏవి తీసుకోవడం వల్ల అరోగ్యంగా ఉంటారు? అనే వివరాల్లోకి వెళితే..

    వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు జోరందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ నీరు కంటే కుండ నీరే మంచిదని అంటున్నారు. అసలు ప్రిజ్ నీరు కంటే కుండ నీరు ఎందుకు బెటర్?

    పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. కుండలో నీరు తాగడం వల్ల ఫ్రిజ్ నీరు కంటే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. మట్టిలో ఎక్కువగా ఎలిమెట్స్ ఉంటాయి. ఇవి కుండనీరు తాగడం వల్ల నేరుగా శరీరంలోకి వెళ్తాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

    రిఫ్రిజిరేటర్ నీరు మోతాదు కంటే ఎక్కువగా చల్లగా ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్ గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి ఎక్కువగా మారుతుంది. కుండలో నీరు చల్లదనాన్ని ఇస్తుంది. మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. మట్టి కుండలో నీరు తాగడం వల్ల అందులో ఉండే ఖనిజాలతో గాయాలు త్వగా మానుతాయి.