Swift 4th Generartion: దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. రెండేళ్ల కిందట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ఇప్పటికీ అత్యధిక అమ్మకాలు జరుపుకుంటోంది. అయితే దీనిని లేటేస్ట్ డిజైన్ తో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. 4వ తరం స్విప్ట్ గా వస్తున్న ఈ మోడల్ ను ఇటీవలే యూకేలో ఆవిష్కరించారు. మార్కెట్లోకి ఇది వచ్చాక గ్రాండ్ ఐ 10, నియోస్ లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
కొత్త స్విప్ట్ కారు నేటి ట్రెండ్ కు అనుగుణంగా ఉండబోతుంది. పెద్ద గ్రిల్ తో విభిన్నమైన ఫాసియాను ఈ కారులో చూడొచ్చు. ఇంటి గ్రేటెడ్ ఎల్ ఈడీ, డీఆర్ఎస్ లతో విభిన్న హెడ్ లైట్ డిజైన్, క్లామ్ షెల్ బోనెట్, స్పోర్టియర్ లోయర్ బంపర్ డిజైన్ ను కలిగి ఉంది. వెనుక డోర్ హ్యాండిల్ తో పాటు టెయిల్ లైట్లు, స్పోర్టియర్ అప్పీల్ తో కూడిన బంపర్, పెద్ద రప్ స్పాయిలర్ ను కలిగి ఉంది. లోపలి భాగంలో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు వైర్ లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ ప్లేను కలిగి ఉంది.
లేటేస్ట్ స్విప్ట్ 1.2 లీటర్ 3 సిలిండన్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 12 వి మైల్డ్ హైబ్రిడ్ సెటప్ తో పాటు ఇంధన సామర్థ్యం స్పృహతో ఉండడం వల్ల ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. సేప్టీ విషయంలో ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానెల్, స్టీరింగ్ వీల్, ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అమర్చారు. అయితే ఇందులో 3వ తరం ఇంజిన్ మాదిరిగానే పెద్ద ఇంజిన్ తో పాటు స్పోర్ట్ వెర్షన్ 3 డోర్ వెర్షన్ ఉండనున్నాయి.
ఈ మోడల్ 3,860 ఎంఎం పొడవు, 1775 ఎంఎం వెడల్పు, 1495 ఎత్తు , 2450 వీల్ బేస్ తో తయారైంది. యూకేలో ఆవిష్కరించిన ఈ మోడల్ జపాన్ స్పెక్ మోడల్ తో సమానంగా ఉంటుంది. త్వరలో దీనిని భారత్ లో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్విప్ట్ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. వీరు తమ పాత మోడల్ స్థానంలో కొత్తది కొనుగోలు చేయడానికి రెడీ అవుతుండగా..కొందరు కొత్తగా దీనిని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.