Post Office Scheme: డబ్బుకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే.చేతిలో డబ్బు లేనిదే ఏమి చేయలేము.అందుకే చాలా మంది డబ్బు సంపాదించడం పై దృష్టి పెడుతున్నారు.తాము కష్టపడి సంపాదించిన డబ్బును మంచి రాబడిని ఇచ్చే పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు .ఈ క్రమంలోనే చాలా మంది డబ్బును బంగారం,రియల్ ఎస్టేట్,స్టాక్ మార్కెట్,మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే నిపుణులు మాత్రం తమ పెట్టుబడి సురక్షితంగా ఉండేలా గ్యారంటీ రిటర్న్స్ వచ్చేలాగా ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటున్నారు.ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్ కూడా ఒకటి.పోస్టాఫీస్ స్కీమ్ లో రోజుకు రూ.95 పెట్టుబడితో ఏకంగా 14 లక్షలు పొందవచ్చు అని తెలుస్తుంది.
ప్రజల కోసం పోస్టాఫీస్ ఎన్నో అద్భుతమైన పథకాలను అమలులోకి తీసుకోని వచ్చింది.ఆ పథకాల్లో పెట్టుబడిపై మంచి వడ్డీరేటును కూడా అందించడం జరుగుంది.పోస్టాఫీస్ అందించే పథకాలలో గ్రామ్ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన్ భీమా యోజన ఒకటి.మనీ బ్యాక్ ప్లాన్ ఉన్న ఈ పథకంలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం పొందవచ్చు అని చెప్తున్నారు.
జీవిత బీమా ను కవర్ చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు.ఈ స్కీమ్ లో రోజు రూ.95 డిపాజిట్ చేయడం వలన మెచ్యూరిటీ లో రూ.14 లక్షలు పొందవచ్చు.19 నుంచి 40 ఏళ్ళు వయసున్న వారు ఈ స్కీమ్ కు అర్హులు.ఇక ఈ పాలసీ వ్యవధి కాలం 15 నుంచి 20 సంవత్సరాలు.ఒకవేళ మీరు ఈ పాలసీ లో 20 ఏళ్ళ వరకు ఉన్నట్లయితే ప్రతి 8 ,12 ,16 సంవత్సరాలకు 20 శాతం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.