Parents And Children: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తెగ గారాబం చేస్తూ ఉంటారు. తమకు ఒక్క పాప లేదా ఒక్క బాబు మాత్రమే ఉన్నారని వారిని కాకపోతే ఎవర్ని గారాబం చేస్తామని అంటూ తెగ ముద్దు చేస్తూ ఉంటారు. ఇలా ముద్దు చేయడం బాగానే ఉన్నా కానీ ఒక్కోసారి మాత్రం ఇది అనుకోని చిక్కులను తెస్తూ ఉంటుంది. కావున పిల్లలను అతి గారాబం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది మాత్రం ఎంత మంది నిపుణులు హెచ్చరించినా కానీ గారాబం చేయడం మానరు.

ఇలా గారాబం చేయడం వలన పిల్లలు తమ తోటి వారితో సరిగ్గా మెదలరు. ఈ ప్రవర్తన ఉన్న పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమే పిల్లలను అతి గారాబం చేయడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. పిల్లలు మీకు ఒక్కరే కావచ్చేమో కానీ వారు చదువుతున్న క్లాస్ రూంలో కేవలం వారు ఒక్కరు మాత్రమే ఉండరని చెబుతున్నారు. అందుకోసమే పిల్లలను అతి గారాబం చేయడం మానేయాలని చెబుతున్నారు.
Also Read: Mahesh Babu CM Jagan: మహేష్ సినిమా పై సీఎం జగన్ కన్ను.. హడాలిపోతున్న ఫాన్స్
కానీ కొంత మంది తల్లిదండ్రులు మాత్రం తమ ప్రవర్తనను మార్చుకోరు. తామే చిన్నపుడు అనేక కష్టాలను అనుభవించామని, అందుకోసమే తమ పిల్లలను చాలా హ్యాపీగా ఉంచుతున్నామని చెబుతారు. అందుకోసమే వారు ఏది అడిగితే అది కొనిస్తూ వారిని తెగ గారాబం చేస్తూ పెంచుతారు. కానీ ఈ గారాబం వలన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టే గారాబం చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

ఇలా గారాబం చేయడం వలన వారు రూలర్లుగా తయారవుతారని వారు చెప్పిన ప్రతీదీ చేయడం వలన వారికి ఇదే అలవాటు అవుతుందని, కాబట్టి ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు. ఈ అలవాటుతో పిల్లలు తమ స్నేహితులతో ఉన్నపుడు కూడా ఇలానే రూలర్స్ లాగా ప్రవర్తిస్తారని కానీ ఒక్కోసారి ఈ విధానం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
Also Read:Telangana State Debt: అప్పుల్లో తెలంగాణ కూడా ఏపీ దారిలోనేనా?
Recommended Videos:


