PMMVY Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ స్కీమ్ ను కేంద్రం మహిళలకు తొలి కాన్పు విషయంలో మాత్రమే అమలు చేస్తోంది. అయితే అతి త్వరలో కేంద్రం రెండో కాన్పుకు కూడా ఈ స్కీమ్ ను అమలు చేయనుందని వార్తలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఈ స్కీమ్ అందించాలని భావిస్తోందని బోగట్టా. ఇప్పటివరకు భర్త ఆధార్ కార్డ్ వివరాలను తీసుకొని కేంద్రం ఈ స్కీమ్ ద్వారా డబ్బులు జమ చేసేది. ఇకపై ఈ నిబంధన విషయంలో కూడా కేంద్రం మార్పు చేయనుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల వల్ల మహిళలకు చాలా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మోడీకి సాధ్యమేనా?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 51.7 లక్షల మంది లబ్ధిదారులు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఈ సాయం అందించనుంది. తొలి విడతలో 1,000 రూపాయలు, రెండో విడతలో 2,000 రూపాయలు మూడో విడతలో 2,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆశా వర్కర్ ను సంప్రదించి ఈ స్కీమ్ లో చేరవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉండరనే సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
Also Read: మహిళా కానిస్టేబుళ్లకు జెంట్స్ టైలర్ తో కొలతలా?