Samantha: సమంత ఆలోచనా విధానం ఈ మధ్య బాగా మారిపోయింది. నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత ఇలా మారిపోతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. గతం తాలూకు జ్ణాపకాలను తలుచుకుంటూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటుంది సమంత. ఏది ఏమైనా తాను సరికొత్త ప్రయాణం మొదలు పెట్టాను అని, భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తున్నాను అని సామ్ చెబుతుంది.

ఇక తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ను పోస్ట్ చేసింది. పైగా ఆ మెసేజ్ కి ఇదే ‘నిజం’ అంటూ ఒక హెడ్డింగ్ కూడా పెట్టింది. మొత్తానికి సమంత పెట్టిన ఆ కొటేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సామ్ మాటల్లోనే.. ‘క్రమశిక్షణగా ఉండాలని ఎవరో చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణతో మెదలడం ఎంతో బలాన్నిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. క్రమశిక్షణతో ఉండటం వల్ల మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి’ అని తెలిపింది.
Also Read: ‘ఎఫ్ 3’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. సాంగ్ అదిరింది !
దీంతో ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ మీరు చెప్పినట్లుగా ఇదే నిజం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సమంతకి ఇలాంటి మెసేజ్ లు చెప్పే హక్కు ఉంది. ఆమె కెరీర్ లో ఎదగడానికి ఎన్నో బాధలు పడింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించింది. ఓ దశలో అయితే, రోజుకు రూ.500 కోసం పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్ లకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పనిచేసింది సామ్.

ఆ రోజుల్లో డబ్బుల్లేక సమంతకి చదువు కూడా మానేయాల్సి వచ్చిందట. అలాగే ఒక పూట భోజనంతో ఆమె 2 నెలలు గడిపిందట. అలాగే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేద్దామంటే.. నీకిది అవసరమా? అని ఆమె కుటుంబ సభ్యులు సామ్ ను వెనక్కి లాగే ప్రయత్నం చేశారని సమంతనే ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా సామ్ ఎమోషనల్ గా తన బాధల గురించి చెప్పి మొత్తానికి అందర్నీ కదిలించింది. అయినా ఎవరి జీవితం అద్భుతంగా ఉందడు. అలాగే సామ్ కూడా తన జీవితంలో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు అనుభవించింది. ఏది ఏమైనా 2021 వ సంవత్సరం సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. అయితే, సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వాటి నుంచి త్వరగానే బయట పడింది.
Also Read: గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. ఆ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయట!
[…] Chiru meets Jagan: ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జరుగుతున్న దుమారం పై తాజాగా జగన్ తో మెగాస్టార్ మళ్ళీ రేపు భేటీ కాబోతున్నారు. ఇటీవల ఆయన సీఎంను కలవగా.. సినిమా టికెట్ల విషయంలో గుడ్ న్యూస్ వింటారని భేటీ అనంతరం తెలిపారు. అయితే దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ‘ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని.. జగన్‌తో చిరు భేటీ పర్సనల్’ అని తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వ్యాఖ్యానించారు. […]