JNU: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏదయ్యా అంటే స్టూడెంట్స్ చెప్పే సమాధానం ‘జవహర్ లాల్ నెహ్రూ’ యూనివర్సిటీ అంటారు. అలాంటి అత్యున్నత యూనివర్సిటీలో ఉప కులపతి పదవి ఫస్ట్ టైం ఒక మహిళకు దక్కడం విశేషంగా చెప్పొచ్చు.

యూనివర్సిటీ ఉప కులపతిగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ను విద్యామంత్రిత్వశాఖ నియమించింది. దీంతో శాంతి శ్రీ తొలి మహిళా ఉపకులపతిగా ఖ్యాతిగడించింది.
జేఎన్.యూ యూనివర్సిటీకి తొలి మహిళా వైస్ చాన్సలర్ శాంతిశ్రీ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె సావిత్రిభాయి పూలే యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా వ్యవహరిస్తున్నారు.
విశేషం ఏంటంటే శాంతిశ్రీ కూడా ఆ యూనివర్సిటీ మాజీ విద్యార్థిని కావడం వివేషం. అందులో ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. ఆమె నియామకానికి.. యూనివర్సిటీ విజిటర్ గా ఉన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ సైతం ఆమోదం తెలిపారు.
శాంతిశ్రీ ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని ఎంఈవో అధికారి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లో సభ్యురాలిగా కూడా శాంతిశ్రీ వ్యవహరిస్తున్నారు.