plants : నేటి యుగంలో పరిశ్రమలు అవి ఎక్కువగా పెరుగుతున్నాయి. బిల్డింగ్‌ల నిర్మాణాల కోసం అడవులను, చెట్లను నరికేస్తున్నారు. కనీసం మొక్కలను నాటకుండా.. ఉన్నవాటిని నరికేయడం వల్ల ఆరోగ్యమైన ఆక్సిజన్ కూడా లేదు. మారుతున్న జీవనశైలి వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. మనం పీల్చే గాలి కూడా చివరికి కలుషితమే. ఇంట్లో, బయట ఎక్కడ గాలి పీల్చిన కూడా కలుషితం మాత్రమే. కానీ స్వచ్ఛమైన గాలి మాత్రం ఉండటం లేదు. చెట్లను నరికేయడం వల్ల వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుంది. ఇలాంటి గాలిని పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే కొన్ని మొక్కలను ఇంటి పెరట్లో నాటుకోవాలి. వీటిని ఇంట్లో నాటడం వల్ల మీరు ఇంట్లో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంట్లో నాటాల్సిన ఆ మొక్కలు ఏవో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
కలబంద
కలబంద అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దాదాపుగా అందరి ఇంట్లో కలబంద మొక్క ఉంటుంది. దీనివల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా చర్మం, జుట్టు కూడా బాగా మెరుగుపడతాయి. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుంది. ఎలాంటి చెడు శక్తులు ఇంటికి రాకుండా ఉంచుతుంది. ఇంట్లో కిటికీ దగ్గర లేదా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో అయిన కూడా మొక్కను నాటుకోండి.
తులసి
హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ మొక్కను పూజించడానికి అందరూ ఇంట్లో పెట్టుకుంటారు. కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఈ మొక్క ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇందులో బోలెడన్నీ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
స్నేక్ ప్లాంట్
సాధారణంగా అందరూ స్నేక్ ప్లాంట్‌ను ఇంటికి అలంకరణగా ఉపయోగిస్తారు. అయితే చూడటానికి అందంగా ఉండే ఈ మొక్క గాలిలో టాక్సిన్స్‌ను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎలాంటి సమస్యలు ఉన్న సానుకూలంగా ఉంచడంలో సాయపడటంతో పాటు స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ ప్లాంట్ ముఖ్యంగా రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి చిన్న కుండలో అయిన ఈ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.
ఎరికా పామ్
ఎరికా పామ్ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదకరమైన వాయువులను గ్రహించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనివల్ల ఇంట్లో ఏవైనా హానికర రసాయనాలు ఉన్నా కూడా వెంటనే గ్రహించేస్తుంది. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఈ మొక్క నీటిలో లేదా కాంతిలో కూడా పెరుగుతుంది. అయితే ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఈ మొక్క ముఖ్యమైనదని చెప్పవచ్చు.
స్పైడర్ ప్లాంట్
గాలిలో హానికర రసాయనాలను శుద్ధి చేయడంలో స్పైడర్ మొక్క బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని శుద్ధి చేసే మొక్క అని కూడా అంటారు. దీనిని బాల్కనీలో పెంచుకుంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గాలిలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్లను శుద్ధి చేస్తుంది. ఈ ప్లాంట్ కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఇవన్నీ గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది.