Marigolds : బంతిపువ్వులతో చర్మం, జుట్టు ఆరోగ్యంగా.. ఎలా అంటే?

కొబ్బరి నూనెలో బంతి పువ్వు ఆకులను వేసి కాస్త మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత తలకు రాస్తే జుట్టు పెరుగుదల ఉంటుంది.

Written By: NARESH, Updated On : October 5, 2024 9:30 pm
Follow us on

Marigolds : చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలని చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. అందరిలో తామే ఎట్రాక్షన్‌గా కనిపించాలని.. రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తారు. ఇలాంటి ప్రొడక్ట్స్‌ను వాడటం వల్ల ఆ నిమిషానికి అందంగా కనిపించవచ్చు. కానీ తర్వాత సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా అందంగా కనిపించాలంటే సహజ పద్ధతులను ఉపయోగించడం మేలు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంటి పెరట్లో పెరిగే బంతిపూలతో చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పసుపుగా ఉండే ఈ పువ్వులతో చిన్న చిట్కాలు పాటిస్తే సహజమైన అందం మీ సొంతం అవుతుంది. ఈ బంతి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మరి ఈ బంతిపువ్వులను ఎలా వాడితే చర్మం ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మానికి ఎలా అప్లై చేయాలంటే?
కొందరి చర్మం తొందరగా ట్యాన్‌కి గురవుతుంది. అలా గురికాకుడదంటే.. తాజా బంతి పువ్వులను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో టేబుల్ స్పూన్ పెరుగు, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేసిన 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మంపై మొటిమలు తొలగి.. ట్యాన్‌కి గురికాకుండా అందంగా ఉంటారు. అలాగే బంతి పువ్వులను నీటిలో మరిగించాలి. ఆ నీటిలో అలోవెరా జెల్ వేసి ముఖానికి అప్లై చేస్తే మురికి అంతా తొలగిపోతుంది. వారానికొకసారి ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. రోజ్ వాటర్‌కి బదులు ఈ బంతి పూల వాటర్‌ను వాడిన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు బంతి పూల పేస్ట్‌లో బియ్యం పిండి, శెనగ పిండి, పసుపు కలిపిన ప్యాక్ చర్మానికి అప్లై చేసి స్క్రబ్‌లా చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం నుంచి విముక్తి పొందవచ్చు.

జుట్టుకు ఎలా ఉపయోగించాలంటే?
బంతి పువ్వును చర్మానికి మాత్రమే కాకుండా.. జుట్టుకు కూడా వాడవచ్చు. కొందరికి ఎక్కువగా జుట్టు రాలుతుంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు బంతి పువ్వుల పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి కింద వరకు రాస్తే బలంగా పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ జుట్టు స్కల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెమటకి జుట్టు కొన్నిసార్లు చండ్రు బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే బంతి పువ్వు చిట్కా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు దృఢంగా పెరగడంతో పాటు మెరిసేలా కూడా చేస్తోంది. అయితే బంతి పువ్వులతోనే కాదు.. ఆకులతో కూడా జుట్టుకి ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ఆకుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో బంతి పువ్వు ఆకులను వేసి కాస్త మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత తలకు రాస్తే జుట్టు పెరుగుదల ఉంటుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.