Nara Lokesh News: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు లోకేష్. ఓ ఐదు రోజులపాటు ఆయన విదేశాల్లో ఉన్నారు. నేరుగా ఏపీకి వచ్చి విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ వెళ్తారు రేపు. ఓ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాధారణంగా యువ నేతలు ఎక్కువగా రిలాక్స్ కు ప్రాధాన్యమిస్తారు. కానీ లోకేష్ మాత్రం అందుకు విరుద్ధం. నిత్యం పర్యటనలతో పాటు పెట్టుబడుల సాధనకు ఎక్కువ కాలాన్ని వినియోగిస్తున్నారు. అయితే ఆయన కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుండడంతో లోకేష్ పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తమౌతోంది ప్రజల నుంచి. లోకేష్ పనితీరు, పరిణితి పెరగడాన్ని టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల విదేశీ పర్యటన..
మొన్న ఆ మధ్యన అమెరికాతో( America) పాటు కెనడా వెళ్లారు మంత్రి లోకేష్. అక్కడ పారిశ్రామికవేత్తలతో రోడ్ షో నిర్వహించారు. అమెరికాలో లోకేష్ పర్యటనకు తెలుగు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. కుటుంబాలతో సహా హాజరయ్యారు. వారందరితో ఓపికగా మేలి గారు లోకేష్. మరోవైపు పెట్టుబడుల సాధనలో భాగంగా అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అందుకు తగ్గ అనుకూలమైన వాతావరణం ఏపీలో ఉందని వారికి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అదే పనిపై ఆయన ఢిల్లీ వెళుతున్నారు. కొన్ని రకాల పెట్టుబడులు, సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు అదే పనిపై ఢిల్లీ వెళ్తున్నారు లోకేష్. రేపు అటు నుంచి అటే విశాఖకు వెళ్తారు.
ఎన్ని రకాల విమర్శలు వచ్చినా..
మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలపై వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రకరకాలుగా విమర్శిస్తోంది. విమాన ఖర్చులు అంటూ ఏవేవో ప్రచారం చేస్తోంది. కానీ లోకేష్ సైతం ఈ విమర్శలను లెక్కచేయడం లేదు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతోనే ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఎక్కడ ఎం వో యు ల గురించి గానీ.. ఒప్పందాల గురించి గానీ ప్రస్తావన చేయడం లేదు లోకేష్. కానీ నేరుగా ఆ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడుతుండడం.. తమ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేస్తుండడం ద్వారా లోకేష్ కృషి బయటపడుతోంది. ఇప్పుడు కూడా లోకేష్ ఢిల్లీ వెళ్లి తన పర్యటనల ప్రగతి గురించి కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. కేంద్ర పెద్దల చొరవ ద్వారా కొన్ని రకాల మినహాయింపులు పొందుతారు. ప్రతిసారి జరుగుతోంది అదే. ఇప్పుడు కూడా అటువంటి ప్రతిపాదనలతోనే లోకేష్ ఢిల్లీలో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.