https://oktelugu.com/

Rosewood Trees : ఈ చెట్టు ఆకులు సంజీవని అంత పవర్‌ఫుల్.. ఒక్కసారి వాడితే వ్యాధులన్నీ పరార్

ఈ రోజుల్లో చాలామంది వ్యక్తిగత విషయాలు, వర్క్ వల్ల బాగా ఒత్తిడికి గురవుతున్నారు. సమస్య తీవ్రం అయ్యి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే రోజ్‌వుడ్ ఆకులు బాగా ఉపయోగపడతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 6, 2024 / 06:34 AM IST

    Rosewood Trees,

    Follow us on

    Rosewood Trees : సంజీవని గురించి అందరికీ తెలిసిందే. మరణించిన మనిషిని కూడా బతికించేంత శక్తి సంజీవనికి ఉంది. అయితే దీని గురించి వినడమే.. కానీ పెద్దగా ఎవరూ చూడకపోయి ఉంటారు. పుస్తకాల్లో, సినిమాల్లో వీటి గురించి బాగానే వింటూనే ఉంటాం. అయితే సంజీవని అంత పవర్‌ఫుల్ ఆకులు గురించి మీలో ఎవరికైనా తెలుసా? ఓ చెట్టు ఆకులతో ఎలాంటి వ్యాధులని అయిన కూడా నయం చేయవచ్చు. మన చుట్టూ ఉండే చెట్లలో చాలా ఔషధాలు ఉంటాయి. నిజానికి ఔషధాలు తయారు చేయడానికి ఆకులను వాడుతుంటారు. కాకపోతే వాటి గురించి మనకి పెద్దగా తెలియదు. మనకి తెలిసిన కలబంద, తులసి వంటి వాటినే కాకుండా మనకి తెలియని కొన్ని చెట్ల ఆకులను కూడా ఆయుర్వేదానికి వాడుతుంటారు. మరి సంజీవని అంత పవర్‌ఫుల్ ఏ చెట్టు ఆకులు? దీంతో ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చనే విషయాలు తెలుసుకుందాం.

    ఆరోగ్యానికి మేలు చేసే చెట్లు దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో రోజ్‌వుడ్ చెట్లు ఒకటి. ఈ చెట్టు ఆకులు, గింజలు, కాండం మొత్తం ఔషధ గుణాలతో ఉంటుంది. ఈ చెట్టులోని ఆకులు, కాండం, గింజలు ఇలా దేనినైనా ఆరోగ్యానికి వాడవచ్చు. ఇది ఒక శీతల చెట్టు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చెట్టుకు చెందిన అన్నింటిని తప్పకుండా ఆయుర్వేదంలో వాడుతారు. అయితే ఈ ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ చెట్టు ఆకులు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఎక్కువగా తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు రోజ్‌వుడ్ ఆకులతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు. చల్లని స్వభావం ఉన్న ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకున్న లేదా నూనె చేసుకున్న ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజ్‌వుడ్ చెట్టు ఆకులు లేదా గింజల పేస్ట్‌ను మడమల మీద రాస్తే నొప్పులు అన్నీ పోతాయి.

    ఈ రోజుల్లో చాలామంది వ్యక్తిగత విషయాలు, వర్క్ వల్ల బాగా ఒత్తిడికి గురవుతున్నారు. సమస్య తీవ్రం అయ్యి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే రోజ్‌వుడ్ ఆకులు బాగా ఉపయోగపడతాయి. మానసిక వేదన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలను తొలగించే శక్తి ఈ ఆకులకు ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ ఆకులను తీసుకుని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేస్తే చల్లగా ఉంటుంది. ఆకులు చల్లని స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల తలకు చల్లదనాన్ని ఇస్తాయి. ఈ చల్లదనం వల్ల ఒత్తిడి, మానసిక సమస్యలన్నీ పరార్ అయిపోతాయి. కొందరు అధికంగా కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు రోజ్‌వుడ్ చెట్టు గింజలను తీసుకుని ఎండుమిర్చితో కలిపి తినాలి. లేదా అరచెంచా గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల ఈ సమస్యలన్నీ క్షణాల్లో పరార్ అయిపోతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.